బరితెగించి అశ్లీల నృత్యాలు
రికార్డింగ్ డ్యాన్సర్ల వలువలూడదీస్తున్న కిరాతకులు
బతుకుదెరువు కోసం వచ్చిన యువతుల బలహీనతతో రాక్షసానందం
తిట్టిపోస్తున్న జాతర్లకు వచ్చిన మహిళలు
టీడీపీ పాలనలో మొదటి స్థానంలో పారిశ్రామిక వృద్ధి
వైసీపీ హయాంలో డ్రగ్స్, అశ్లీల నృత్యాల్లో మొదటి స్థానం
రాష్ట్రంలో వైసీపీ నేతల, కార్యకర్తల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించడంతోపాటు అశ్లీల నృత్యాల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. బతుకుదెరువుకోసం వచ్చిన యువతుల వలువలు ఊడదీసి రాక్షసానందం పొందుతున్నారు. యువతను డ్రగ్స్ మాఫియాకు, మహిళలంటే గౌరవంలేకుండా వారిపట్ల అసహ్యంగా ప్రవర్తించే విధంగా అశ్లీల నృత్యాలతో ప్రోత్సహిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఈ రకమైన విష సంస్కృతికి తెరలేపారు. గతంలో ఏ పార్టీ నాయకులు ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన దాఖలాలు లేవు. వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డూఅదుపూలేకుండా వికృతచేష్టలతో ఇటువంటి సంస్కృతిని పెంచిపోషిస్తున్నారు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు కోకొల్లలు జరిగాయి. జరుగుతున్నాయి. అనేక ప్రాంతాలలో ఇటువంటి చట్ట వ్యతిరేక, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందరు వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కేసులు నమోదు చేయని ఘటనలు అనేకం ఉన్నాయి. తప్పు చేస్తే జగన్ కంటే ముందు గన్ వస్తుందని ప్రస్తుత మంత్రి రోజా గతంలో అనేక సార్లు చెప్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఆ భయం ఉంటే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతారా? యువతులంటే గౌరవంలేకుండా వైసీపీ నాయకులు చేసే అశ్లీల నృత్యాల వీడియోలను చూసి ఆ పార్టీ అధినేతలు కూడా ఆనందపడుతున్నారేమోనన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తొగురువారిపాలెంలో పోలేరమ్మ తిరునాళ్లలో ఈ నెల 21 గురువారం పట్టపగలే వైసీపీ నేతలు అశ్లీల నృత్యాలను ప్రోత్సహించారు. అక్కడి ఆలయ కమిటీవారు యువతులచేత బట్టలు విప్పించి మరీ డ్యాన్సులు చేయించారు. తిరునాళ్లకు వచ్చిన వాళ్లు ఆ నృత్యాలను వైసీపీవారు ప్రోత్సహిస్తున్నారని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జాతరలో అమ్మవారి దర్శనానికి వెళ్లిన గృహిణులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. జాతర పేరు చెప్పి బట్టలు విప్పించి డ్యాన్సులతో ఇంత అరాచకమా? యువతులు నగ్నంగా డ్యాన్సులు వేస్తుంటే కొందరు యువకులు ఫోన్లలో వీడియోలు తీశారు. యువతులతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన ఆ నేతలను అరెస్టు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పోలీసులంటే భయముంటే పట్టపగలు ఇలాంటి డ్యాన్సులు వేస్తారా? భక్తిశ్రద్ధలతో జాతర జరిపించాల్సిన ఆలయ కమిటీ బూతు పనులకు జైకొట్టడమేంటి?
సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో అప్పటి స్థానిక మంత్రే క్యాసినో నిర్వహించారు. అప్పట్లో రాజకీయంగా పెద్దదుమారం చెలరేగింది. గోవాను తలపించేలా భారీ సెట్ వేసి రంగు రంగుల లైట్లలో డీజే, రికార్డింగ్ డ్యాన్సులు, స్పెషల్ ఎఫెక్ట్ గా చీర్ గర్ల్స్ తో డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు చేయించారు. వారు బహిరంగంగా ఎంతకు బరితెగించారంటే.. ఆ కేసినో మొత్తానికి వైసీపీ రంగులు వేశారు. లైటింగ్ కూడా అవేరంగులు వచ్చేవిధంగా పెట్టారు. అలా చేయడం ఆ పార్టీవారు చాలా గొప్పగా ఫీలయినట్లు ఉన్నారు. ఆ వీడియోలు కూడా మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలై రాష్ట్రం పరువు పోయింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కూడా లేఖ రాశారు. టీడీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే, వైసీపీ హయాంలో క్యాసినో కల్చర్, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మండిపడ్డారు. ఈ విషయమై రాష్ట్రమంతా దుమారం చెలరేగినా పోలీసులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వాటి జోలికి పోవడానికి కూడా ఏ మాత్రం సాహసించలేదు. అంతపెద్ద ఎత్తున క్యాసినో నిర్వహిస్తే వారికి తెలియకుండా ఏమీ ఉండదు. వారికి ముందుగా తెలిసే ఇదంతా జరిగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పోలీసు వ్యవస్థ తీరుపై ప్రజల్లో విశ్వాసం బాగా సన్నగిల్లింది. ఇదే ప్రారంభం కాదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఇటువంటి చర్యలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. ఈ ఘటన తరువాత బూతుల మంత్రిని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది మహిళల పట్ల బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్లలో గత జనవరిలో జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ స్వయంగా ప్రారంభించిన కార్యక్రమంలో యువతులతో అశ్లీలనృత్యాలు చేయించారు. ఎమ్మెల్యే కూడా కొద్దిసేపు తిలకించారు. వైసీపీ నేతలు ఆ యువతులతో తెల్లవార్లూ అసభ్యంగా ప్రవర్తిస్తూ చిందులు వేస్తూ ఊగిపోయారు. స్థానిక పోలీసులు మాత్రం అసలు పట్టించుకోలేదు.
విశాఖ జిల్లా పెదబయలు మండల రూఢకోట గ్రామంలో మార్చిలో గంగమ్మతల్లి ఉత్సవాల్లో కూడా ఓ చిన్నసైజు కేసినో నిర్వహించారు. గుడివాడలో మాదిరిగానే ఇక్కడ కూడా వైసీపీ నేతలే అరాచకంగా ప్రవర్తించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ స్టేజీ ఎక్కి డ్యాన్స్ చేసే యువతులను పట్టుకోరాని చోట పట్టుకొని చాలా అసహ్యంగా, అశ్లీలంగా స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయాడు. ఈ దృశ్యాలను చూసి స్థానికులు మండిపడ్డారు. ఆ సర్పంచ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినా, నెటిజన్లు అనేక విధాలా విమర్శించినా వైసీపీ నేతలకు సిగ్గురాలేదు. ఆ తరువాత కూడా ఆ పార్టీ నాయకులు అదే అనుసరిస్తున్నారు.
అంతకు ముందు గతంలో కూడా అనేక చోట్ల జరిగిన కార్యక్రమాలలో ఈ పార్టీ నేతల అశ్లీల నృత్యాలు, వికృత చేష్టలకు ప్రజలు అసహ్యించుకున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డు ఆవరణలో రైతు దినోత్సవం, వైసీపీ నాయకుడు షేక్ గని పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది జూలైలో వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. వారు కూడా ఆ యువతులతో అసభ్యంగా డ్యాన్సలు వేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అయితే, ఇక్కడ పోలీసులు ఆ వీడియోని సుమోటోగా తీసుకుని నలుగురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అంతేకాకుడా, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా కూరాడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా గత డిసెంబరులో శివాలయం వెనుక అశ్లీల నృత్యాలు నిర్వహించారు. వైసీపీ నేత, సొసైటీ చైర్మన్ రావుల ప్రసాద్ నేతృత్వంలో విశాఖపట్నం నుంచి పలువురు యువతులను రప్పించి నృత్యాలు చేయించారు. అంతేకాకుండా, ఆయన కూడా వారితో కలిసి డాన్స్ చేశారు. దాంతో కుర్రకారు రెచ్చిపోయారు. వీటిని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిర్వాహకుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు మహిళలు, మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల స్మృతి వనంలో 2020 డిసెంబరులో అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్ పుట్టినరోజు వేడుకలలో కూడా అశ్లీల నృత్యాలు చేశారు. వైసీపీ నేతలు పలువురు మద్యం సేవించి రికార్డింగ్ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేశారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో కూడా గతంలో పుట్టినరోజు వేడుకల పేరుతో అమ్మాయిలను రప్పించి, మద్యం సేవిస్తూ రచ్చ రచ్చ చేశారు. పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మద్యం తాగుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. వేడుకల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.