- ప్రజలపై భారం పడకుంగా చర్యలు
- రూ.4,492 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు భరించనున్న కూటమి ప్రభుత్వం
- హామీలన్నీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు సుపరిపాలన
- ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నుకసాని బాలాజీ
అమరావతి (చైతన్యరథం) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూస్తోందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం 18 నెలలుగా సుపరిపాలన అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారు. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు, దౌర్జన్యాలకు గురయ్యారు. జగన్ రెడ్డి పాలనలో రాజ్యాంగ పాలనకు బదులుగా అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా పాలన సాగించారు. దీంతో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు కూటమికి 164 సీట్ల భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిగా రాష్ట్రాన్ని మార్చేశాడు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని నూకసాని బాలాజీ చెప్పారు.
9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్
జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేసేశాడు.
అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి చేశాడు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం వేశాడు. అదే జగన్ రెడ్డి నేడు.. కూటమీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు.. ప్రజలను అన్యాయం చేస్తోందంటూ.. వారి దొంగల ముఠాతో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా కూడా ప్రజలు ఎవరూ కూడా పట్టించుకునే స్థితిలో లేరు. బ్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.4,492 కోట్ల మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసుకుంటామని విద్యుత్ సంస్థలు కోరినా సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించలేదు. ప్రజలపై అధిక భారం పడకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగానే ట్రూఅప్ ఛార్జీలు రూ.4,492 కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా చేసి, ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందజేశారని నూకసాని బాలాజీ తెలిపారు.
విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు
జగన్ రెడ్డి పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూలు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ.150లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి పాలనలో రూ.5.19లకు బయటనుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 4.70లకు కొనుగోలు చేస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో ఛార్జీలు పెంచి.. కమీషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపారు. రోజురోజుకు మారుతున్న ధరలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నేతలు జేబులు నింపుకునేందుకు, కమీషన్లు కోసంకక్కుర్తి పడి రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారే తప్ప.. ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేశారు.. అక్రమ కేసులు పెట్టారు… పెట్టుబడులను తరిమికొట్టారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధ పాలన అనేది కనిపించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఒక పక్క రాజ్యాంగబద్ధ పరిపాలన అందిస్తునే.. మరోపక్క జగన్ రెడ్డి ముఠా చేసిన దోపిడీలకు చరమగీతం పాడుతూ.. మరోపక్క ప్రజల మీద పడ్డ ఆర్ధిక భారాలను తగ్గిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక విద్యుత్ సంస్కరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో సోలార్, పవన విద్యుత్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూప్టాప్లు, బీసీలకు రూ.20 వేలు అధిక సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ లు అందజేస్తున్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సూకసాని బాలాజీ చెప్పారు.
జగన్ అబద్ధాలను ప్రజలు నమ్మరు
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కేవలం 15 శాతం హామీలను మాత్రమే అమలు చేసిన విషయాన్ని మరిచిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేస్తే.. ప్రెస్మిట్లు పెట్టి కూటమి ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆరాచక, కక్ష్యసాధింపు చర్యలు తీసుకుంటున్నారని ప్రజలను మభ్యపెట్టే విధంగా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. కానీ, ప్రజలెవరూ కూడా ఆయన అబద్ధాలను నమ్మే సిద్ధిలో లేరని గ్రహించలేకపోతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు అమోదయోగ్యమైన పాలన అందిస్తూ.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా సమాపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అమలు చేసి చూపించారు. అలాగే రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాలకు ఉద్యోగాలు లభిస్తాయి. రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం పనులుగా జోరుగా సాగుతున్నాయి. ఇన్ని చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అతని ముఠా బులుగు మీడియాలో ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేయాలో చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్పా.. రప్పా అంటున్నారు.. కానీ, ఐదేళ్ల కాలంలో జగన్ రెడ్డి విధ్వంసక, అవినీతి, అరాచక పాలనను.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనను చూసిన ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఈ సరికే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమమైపోయిందని నూకసాని బాలాజీ ఉద్ఘాటించారు.














