విజయవాడ (చైతన్య రథం): తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌న అపహరించి, బెదిరించిన కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండును కోర్టు పొడిగించింది. వంశీని వర్చువల్గా జడ్జి ఎదుట జైలు అధికారులు ప్రవేశపెట్టారు. ఈనెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.