మదనపల్లె (చైతన్యరథం): అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లోని దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలో ఆయన్ని గురువారం అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జులై 21న రాత్రి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పలువురు ఉద్యోగులు, నేతలపై కేసులు నమోదు చేశారు.
`