ఉండవల్లి: మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో బొల్లినేని చంద్రిక 084 కేజీ సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బొల్లినేని చంద్రికను మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్లో అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.















