ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుపాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని సీపం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మెమొంటోలు, సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో మంత్రి డోలా సీఎం చేతులమీదుగా ప్రశంస పత్రం, ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లాలోనూ ఇన్చార్జి మంత్రిగా స్వామి తుఫాను సహాయక చర్యలపై అధికారులను సమన్వయం చేసి ప్రజలకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న మంత్రి డోలా మాట్లాడుతూ…`సమర్థుడైన సీపం ముందుచూపువల్లే తుఫాను నష్టాలను నియంత్రించగలిగామన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ఆర్టీజీఎస్ ద్వారా తుఫాన్‌పై నిరంతరం సమీక్షిస్తూ అధికారుల్ని, కూటమి క్యాడర్‌ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ముందస్తు అప్రమత్తతవల్లే ప్రాణ, పశునష్టం తగ్గిందని స్పష్టం చేశారు. తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మంత్రి డోలా ధన్యవాదాలు తెలిపారు.














