రోడ్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు నుంచి రూ.37 వేల కోట్ల వినతు లు వచ్చాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. వీలైనంత వరకు అందరికీ సమ న్యాయం చేసేలా రోడ్లను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఉన్న బడ్జెట్‌లో వీలున్న మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నామని తెలి పారు. అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ సైతం..
సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సైతం తన నియోజకవర్గంలోని ఒక వంతెనకు సంబంధించి విషయం ప్రస్తావించారు. గతంలో వంతెన విషయం తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని మంత్రి జనార్దన్‌రెడ్డికి చెప్పగా మంత్రి సానుకూలంగా స్పందించారు. వంతెనను పూర్తి చేస్తామని తెలిపారు.