.కిమ్‌ను మించిపోయిన జగన్ రెడ్డి!
.అక్రమాలను బయటపెట్టినందుకే కేశవ్ భద్రత తొలగింపు.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉత్తర కొరియా నియంత కిమ్‌ని మించిపోయాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకి తానే ప్రకటించుకున్న జగన్.. పిచ్చి ముదిరాక రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని తానేనని ప్రకటించుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించేశారు. ఇప్పటికే జగన్‌రెడ్డి ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడిరచిన కేశవ్ తనకు అదనపు భద్రత కావాలని ప్రభుత్వాన్ని కోరితే..ఉన్న సెక్యూరిటీ తొలగించేశారు. ఈ కక్షసాధింపులతో వైసీపీ సర్కారు వేలకోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టే. తక్షణమే కేశవ్‌కి అదనపు గన్మెన్లను కేటాయించి సెక్యూరిటీ పునరుద్దరించాలని విజ్జప్తిచేశారు.