- కూటమి నేతల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు
- నేతలందరూ బూత్‌స్థాయి నుంచి బాధ్యత తీసుకోవాలి
- ప్రజల కోసం విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నా
- అనర్హత వేటు పడుతుందనే భయంతోనే అసెంబ్లీకి జగన్
పాలకొల్లు (చైతన్యరథం): పాలకొల్లు నియోజకవర్గ నా కుటుంబ సభ్యులైన ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో నేడు మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధితోపాటు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసేవలో రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నాను.. మీకోసం విశ్రాంతి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపును కోరుతూ ఆదివారం జరిగిన పాలకొల్లు నియోజకవర్గస్థాయి కూటమి ముఖ్య నాయకుల విస్తృత సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ గెలుపు ఏకపక్షం కావాలని అందుకు ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వెయ్యాలని పట్టభద్ర ఓటర్లందరినీ కలిసి కోరాలన్నారు.
గడిచిన 8 నెలల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, జరగబోయే స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర శాసనసభతో పాటు శాసనమండలిలోనూ కూటమి మెజార్టీగా ఉండాలంటే ఎమ్మెల్సీ గెలుపు చారిత్రాత్మక అవసరం అన్నారు. ప్రతి ఒక్కరు బూత్‌స్థాయి నుంచి బాధ్యత తీసుకోవాలని మంత్రి రామానాయుడు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్రమాట్లాడుతూ రాజశేఖర్ గెలుపులో కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలని, పాలకొల్లు నియోజకవర్గంలో మంచి మెజార్టీ తీసుకురావాలని తెలిపారు.
పదవి పోతుందనే భయంతోనే..
ఐదేళ్ల పాటు మోసాలు, దోపిడీ, విధ్వంసానికి పాల్పడ్డారని… అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ ను ఇంటికి సాగనంపారని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ దుర్మార్గపు చేష్టలను ప్రజల గమనిస్తూనే ఉన్నారని అన్నారు. జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తోంది ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని… తన పదవి పోతోందనే భయంతోనే అసెంబ్లీకి వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుబు విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చెట్టి చంద్రమౌళి, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, కోడి విజయభాస్కర్, మామిడి శెట్టి పెద్దిరాజు, మహమ్మద్ జానీ, తుల రామలింగేశ్వరరావు, జక్కంపూడి కుమార్, పెనుమచ్చ రాంబద్రం రాజు, బొప్పన హరికిషోర్, బోనం నాని, పెనుమచ్చ సత్యనారాయణ రాజు, పాలవలస తులసిరావు, దాసరి రత్నం రాజు, కడలి గోపి, పొట్నూరి శ్రీనివాస్, ఇంటి శ్రీరాముడు, శిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.