వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన 56 మండల పరిషత్‌లలో 40 మాత్రమే దక్కడం ఉన్నది ఊడడం కాదా? ఉపసర్పంచ్‌లు కూడా కలిపితే 248 స్థానాలకు గాను వైకాపా గెలిచింది కేవలం 104 మాత్రమే. వైకాపా రెబల్స్ గెలిచింది 141 స్థానాలలో అనేది అసలైన లెక్క కాదా?
ఎంపీపీ, ఉప ఎంపీపీ, ఉప సర్పంచ్ పన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు.
ఇటీవలి శాసన మండలి పన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 65 శాతం నెగ్గింది నిజం.
30.3.2025న వర్దెల్లి మరళి షరా మామూలుగానే అబద్ధాలతో సాక్షిలో భారీ వ్యాసం రాశారు. అందులో 56 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా 40 స్థానాల్లో విజయం సాధించిందని గాలిలో తేలిపోయారు. ఉప సర్పంచ్‌లతో సహా మొత్తం ఉప పన్నికలు జరిగింది 248 స్థానాలు. అందులో వైకాపా గెలిచింది 104 స్థానాలు. వైకాపా రెబల్స్ గెలిచింది 141 స్థానాలలో అనేది నిజం. ఉపఎన్నికలు జరిగిన స్థానాలన్నీ వైకాపాకు చెందినవే కనుక టీడీపీ పోటీ చేయలేదు. టీడీపీ పోటీ చేసి గెలిస్తే అది అక్రమమని ఏడుస్తారు. వదిలేస్తే వెక్కిరిస్తారు. వైకాపా ఫ్రస్ట్రేషన్ పీక్‌లో ఉందనేదానికి మురళి వ్యాసం మంచి ఉదాహరణ. ఆత్మవిశ్వాసం పాతాళానికి పడిపోతున్న వైకాపా శ్రేణులకు తిరిగి ఆత్మవిశ్వాసం కల్పించే డూప్ చర్యగా ఆ వ్యాసం ఉన్నది.
ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 65 శాతం ఓట్లతో గెలిస్తే, అదంతా రిగ్గింగ్ అంటూ ఆత్మవంచన చేసుకుంటారు. పరిషత్ ఉపఎన్నికల్లో దొరికిన గడ్డిపోచల్ని చేవదేలిన మానుల్లా భావించి గాలిలో తేలిపోతున్నారు. చీలిపోయిన టైర్‌కు పంత గాలి కొట్టినా పలా నిలుస్తుంది? టైరు మార్చుకోకుండా చేసే విన్యాసమంతా వ్యర్థ ప్రయత్నమే. సీబీఐ కోర్టు విచారణకు తప్పించుకోకుండా కోర్టు వాయిదాలకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోకుంటే జగన్‌ను ప్రజలు నమ్మరు. తల్లి, చెల్లికి సమానా వాటా ఇవ్వకపోతే మహిళలు ఓట్లు వేయరు. వివేకా హత్యారోపణలు పదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నంత కాలం జగన్ తిరిగి అధికారంలోకి రాడు. వేకువజాము ఫోన్‌కాల్‌పై సీబీఐ విచారణ చేసుకోమని స్వయంగా కోరితేనే జనం నమ్ముతారు. లేకుంటే ఇంతే సంగతులు.
పర్యటనల్లో తన చుట్టూ చేరి సీఎం అంటూ ఊగిపోయే మాఫియాల్ని చూసి, అది బలమనుకుంటే చివరకు వాపు అవుతుంది. కేవలం తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో ప్రజా విశ్వాసం మెండుగా పొంది ఉన్నది. డీఎస్సీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు వేట నిషేధభృతి వచ్చే జూన్‌లోపు ఇవ్వబడుతుంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌లో భాగంగా కోటిమందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఒకే దఫాలో పింఛన్ రూ.1000 పెంచారు. 204 అన్న క్యాంటీన్లలో పేదలకు అతి తక్కువ ధరకు ఆహారం అందుతోంది. ఇలా మొదటి ఏడాదే ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదనేది వాస్తవం.
` గురజాల మాల్యాద్రి
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్