మంగళగిరి(చైతన్యరథం): బడుగుల ఆశాజ్యోతి, సామాజిక సంఘ సంస్కర్త, రచయి త, విద్యావేత్త జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కులవ్యవస్థను, జాతి వివక్షను, స్త్రీ అణచివేతను ఖండిరచి సమాజం లో సమానత్వం కోసం కృషిచేసిన మహనీయుడు పూలే అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్య కోసం పాటుపడిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు, సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అదర్శమూర్తిని నేటి యువత అదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని, వివక్షను రూపుమాపాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, ఎమ్మెల్సీ అశోక్బాబు, టీటీడీ సభ్యులు జంగా కృష్ణమూర్తి, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కుల రఘురామరాజు, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ఉపాధ్య క్షుడు కోటేశ్వరరావు, టీడీపీ కార్యాలయ రిసెప్షన్ ఇన్చార్జి హాజీ హసన్బాషా, పీరయ్య, తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.