తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు…. జగన్మోహన్‌రెడ్డికి లండన్ మందులు పనిచేయక పిచ్చి ముదిరి, సైకోయిజం మరింత పెరిగిపోతోందని నిన్న తాను నిర్వహించిన సాక్షి పత్రిక, ఛానల్‌కు సంబంధించిన విలేకరుల సమావేశం స్పష్టం చేసింది. నేను రాష్ట్రం నెత్తిన దాదాపు రూ.2లక్షల కోట్ల భారాన్ని మోపడానికి రూ.1,750 కోట్లు లంచం తీసుకుంటే.. నన్ను తప్పు చేశానని అనడం మీకు న్యాయమా? అని ఓవైపు మీడియాను, మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అక్కడితో ఆగకుండా మరో నాలుగు అడుగులు ముందుకువేసి జగన్ మాట్లాడుతూ…. ఇంతటి ఘనకార్యం చేసిన నాకు శాలువాలు కప్పండి… అభినందన సభలు పెట్టి పొగడండి… వీలైతే భజనలు చేస్తూ నన్ను కీర్తించండి. ఏమైనా అవకాశాలుంటే అవార్డులు ఇచ్చి సన్మానించండి. అంతేకాని నేను లంచం తీసుకుంటే తప్పు అంటున్నారు, రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపితే అన్యాయం అంటున్నారు, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తే నాపై అభాండాలు వేసి నాపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 28న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేదనను వెళ్లగక్కాడు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లు, అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్‌రెడ్డికి ఘన సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్‌రెడ్డి మానసిక పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు సర్వనాశనం చేయడంతోపాటు, రాష్ట్రం ఏమైనా తనకు పట్టనట్టు వ్యవహరించి… తన జేబులు మాత్రం ఖాళీలేకుండా నింపుకున్నందుకు ఈ రాష్ట్రం జగన్మోహన్‌రెడ్డిని సన్మానించాలి, శాలువాలు కప్పాలి, అవార్డులు కూడా ఇవ్వాలి. చరిత్రలో రెండు రకాల వ్యక్తులు నిలిచిపోతారు. 1. గొప్పవారు. 2. దుర్మార్గులు. గొప్పవారి చరిత్రను భావితరాలకు స్ఫూర్తికోసం చెబుతారు. దుర్మార్గుల చరిత్రను భవిష్యత్తు నాశనం కాకుండా చూసుకునేందుకు ఉదాహరణగా చూపుతారు. ఈ రెండిరటిలో జగన్మోహన్‌రెడ్డి ఏకోవకు చెందినవాడో రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా తేల్చిచెప్పారు. అయితే గత ఐదేళ్లలో జగన్మోహన్‌రెడ్డి నిర్వాకం, తన వ్యక్తిత్వం, పరిపాలనా వైఫల్యం, ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అణచివేతలు, అక్రమ కేసులు, అడ్డగోలు కేసులు, హత్యలు, మహిళల భద్రత, ఆర్థిక నేరాలు, దోపిడీ విధానాలు తదితర అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కొన్ని బిరుదులు లేదా అవార్డులు ఇవ్వడం అనివార్యం. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పీడకలలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.. అక్కర్లేదు!
‘‘వెన్నుపోటుదారుడు’’ జగన్‌రెడ్డి:
జగన్మోహన్‌రెడ్డికి తన గుణగణాలను బట్టి వెన్నుపోటుదారుడు అనే బిరుదు ఇచ్చి, ఘనంగా సన్మానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే… ఏరుదాటే వరకు ఓడ మల్లన్న…. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న…అనే సామెత జగన్మోహన్‌రెడ్డికి చాలా ఇష్టం. అందుకేనేమో అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలు తన దగ్గరకు రాకపోయినా, తానే స్వయంగా వెళ్లి కౌగిలించుకోవడం, ముసలి వారికి ముద్దులు పెట్టడం, బుగ్గన చేతులు పెట్టి నిమరడంతో పాటు, రాష్ట్ర ప్రజలందరి నెత్తిన చేతులు పెట్టాడు. ఆ సమయంలో మీరే నావాళ్లు అని ప్రజలను నమ్మించాడు. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌కి వచ్చి ఒక్కరంటే ఒక్క సామాన్యుడు కలిసి, తన కష్టాలు చెప్పుకున్న దాఖలాలు లేవు. సమస్యలు పరిష్కారం అయిన రికార్డు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు మూలవిరాట్ జగన్మోహన్‌రెడ్డే కదా? అందుకే జగన్మోహన్‌రెడ్డికి వెన్నపోటుదారుడు అనే బిరుదు తప్పకుండా ఇచ్చి సన్మానించాలి.
‘‘రైతుల పాలిట శాపం’’ జగన్:
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర రైతాంగం సుఖశాంతులతో ఉన్నారు. జగన్ సీఎం అయినది మొదలు ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభం బాటపట్టింది. ముఖ్యంగా కౌలురైతులకు వ్యవసాయం ఉరితాడు అయ్యింది. గత ఐదేళ్లలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రకృతి విపత్తులతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అప్పులభారం తట్టుకోలేక ఆత్మహత్యల బాటపట్టారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోకి వెళ్లిందంటే జగన్ పాలనలో రైతుల పరిస్థితి ఎంతటి దుర్భరంగా మారిందో కేంద్ర గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ ముందుకు తీసుకెళ్లలేదు. అంతేగాకుండా రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్‌రెడ్డి గోదావరిలో ముంచి నాశనం చేసి రైతులపట్ల తన క్రూర మనస్తత్వాన్ని నిరూపించుకున్నాడు. రైతులకు సబ్సిడీలు లేవు, విత్తనాలు లేవు, పంటల బీమా లేదు, సకాలంలో ధాన్యం డబ్బులు లేవు, ఎరువులు లేవు, సహాయ సహకారాలు లేవు. మొత్తంగా చెప్పాలంటే జగన్ పాలన రైతులకు కష్టకాలంగా మారింది. రైతులను ఇంతటి దుస్థితిలోకి తీసుకెళ్లిన జగన్‌కు రైతుల పాలిట శాపం అనే బిరుదు ఇవ్వకపోతే వ్యవసాయ రంగాన్ని అవమానించినట్లే అవుతుంది.
‘‘మహిళా ద్రోహి’’ జగన్:
జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని ఏపీ ప్రజలు చెప్పడం కాదు.. కేంద్ర గణాంకాలే చెప్పాయి. మహిళలపై దాడులు, హత్యల్లో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్) చెప్పకనే చెప్పాయి. జగన్మోహన్‌రెడ్డి నోరుతెరిస్తే నా అక్కచెల్లెమ్మలు అని అనేవాడు. కానీ మహిళలపై అఘాయిత్యాలు జరిగితే… చివరకు తన ఇంటికి అత్యంత దగ్గరగా కూతవేటు దూరంలో దళిత యువతి అత్యాచారానికి గురైతే కనీసం స్పందించటువంటి మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్ల పాలనలో మహిళలపై 78,090 నేరాలు జరిగాయి. 22,278మంది మహిళలు అదృశ్యం అయ్యారు. 15,065మంది మహిళలు గృహ హింసకు గురయ్యారు. మహిళలపై 14,438 దాడులు జరిగాయి. చిన్నారులపై 7,841 నేరాలు చోటుచేసుకున్నాయి. 6,604మంది మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగింది.. 5,660 మంది మహిళల విషయంలో సైబర్ నేరాలు జరిగాయి. 4,320మంది మహిళలు వలంటీర్లతో వేధింపులకు గురయ్యారు. 4,034మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 991మంది మహిళలు హత్యకు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 442మంది మహిళలను వైసీపీ దుర్మార్గులు వేధించారు. 60 గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. 9మంది మహిళలపై యాసిడ్ దాడులు జరిగాయి. దీన్నిబట్టి చూస్తే… జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదనేది సుస్పష్టం. మహిళలకు అన్యాయం చేసిన జగన్మోహన్‌రెడ్డికి మహిళా ద్రోహి అనే అవార్డు ప్రకటించకపోతే మహిళాలోకాన్ని అవమానించినట్లే కదా?
‘‘ప్రపంచస్థాయి ఆర్థిక నేరగాడు’’ జగన్:
ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికాకి చెందిన ప్రఖ్యాత నేర దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) న్యూయార్క్ కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో జగన్మోహన్‌రెడ్డి లంచం తీసుకున్నాడు లేదా లంచం తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పకనే చెప్పింది. దీంతో జగన్మోహన్‌రెడ్డి అవినీతి ప్రపంచస్థాయికి చేరిందని రుజువైంది. ఆర్థిక నేరాలతో తనస్థాయిని జగన్ ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడు గర్వించదగిన విషయం. మొన్నటి వరకు జగన్మోహన్‌రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలలో కేసులు ఉన్నాయి. కేవలం జాతీయస్థాయిలోనే ఆర్థిక నేరగాడిగా ఉన్న జగన్, ఈ రాష్ట్రంపై రూ.2లక్షల భారాన్ని మోపేందుకు రూ.1,750కోట్లు లంచం తీసుకుని ప్రపంచస్థాయి ఆర్థిక నేరస్తుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఇలాంటి ప్రపంచస్థాయి ఆర్థిక నేరస్తుడు మన మాజీ ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. అందుకే జగన్మోహన్‌రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా ప్రపంచ ఆర్థిక నేరస్తుడు అనే బిరుదునిచ్చి సన్మానించాల్సిందే.
‘‘నరరూప రాక్షసుడు’’ జగన్:
జగన్మోహన్‌రెడ్డి తన చేతకాని పరిపాలనతో ఐదేళ్లలో 1,04,446 మందిని బలితీసుకున్న నరరూప రాక్షసుడు. వివిధ ఘటనల్లో లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. కచ్చులూరు బోటు ప్రమాదంలో 39మంది, అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలో 33మంది, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13మంది, జంగారెడ్డి కల్తీ మద్యం ఘటనలో 27మంది, జగన్ నిర్లక్ష్యంతో కరోనాతో 47,000మంది, రుయా ఆసుపత్రి, ఆక్సిజన్ అందక రాష్ట్రవ్యాప్తంగా 112మంది, ఆత్మహత్యలతో నిరుద్యోగ యువత 21,572, రైతులు 4,000మంది, కల్తీమద్యం, శానిటైజర్ తాగి 30,000మంది, మహిళలు 991మంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు 98మంది, బీసీలు 300మంది, ఎస్సీలు 192మంది, ఎస్టీలు 58మంది, మైనార్టీలు 11మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చిన చేతకాని అసమర్ధుడు జగన్మోహన్‌రెడ్డికి నరరూప రాక్షసుడు అనే బిరుదు ఇవ్వాల్సిందే… శాలువా కప్పి సన్మానించాల్సిందే.
‘‘అప్పుల అప్పారావు’’ జగన్:
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన జగన్మోహన్‌రెడ్డికి ఏ బిరుదిచ్చినా తక్కువే. ప్రతి మంగళవారం… అప్పులవారంగా మార్చిన వ్యక్తి జగన్. గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అప్పులు తెచ్చే ఏజెంట్‌గా మార్చిన అప్పుల రత్న జగన్మోహన్‌రెడ్డి. గత ఐదేళ్లలో ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పకుండా, అప్పటికే ఉన్న పరిశ్రమలను కమీషన్ల పేరుతో వేధించి రాష్ట్రంనుండి తరమేసిన ధన పిశాచి జగన్మోహన్ రెడ్డి. దీంతో రాష్ట్రంలో సంపద సృష్టించే వ్యవస్థ అంపశయ్యపైకి వెళ్లింది. ఫలితంగా జగన్మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి తన జేబులు నింపుకున్నాడన్నది అక్షర సత్యం. తన అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రజలకు పథకాల పేరుతో పప్పు,బెల్లం పంచి నోరు మూయించాడు. ఐదేళ్లలో ఏపీ అప్పులను రూ.10లక్షల కోట్లకుపైగా తీసుకెళ్లిన జగన్‌రెడ్డికి అప్పుల అప్పారావు అనే బిరుదు ఇవ్వకపోతే ఆర్థికరంగ నిపుణులు బాధపడతారు… జగన్మోహన్ రెడ్డి మనస్తాపానికి గురవుతాడు.
‘‘గొడ్డలి వేటులో పోటుగాడు’’ జగన్:
ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడం కోసం… ప్రజల్లో సానుభూతి సంపాదించడం కోసం సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో లేపేసిన పోటుగాడు జగన్మోహన్ రెడ్డి. తాను హత్య చేయించి, ఆ హత్యను చంద్రబాబుపై నెట్టేందుకు నారాసుర రక్తచరిత్ర అంటూ కట్టుకథ అల్లి ప్రజల దృష్టిని మరల్చి, ఏమార్చిన దుర్మార్గుడు జగన్. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చిన్నాన్న కేసును అంగుళం కూడా ముందుకు కదలకుండా అడ్డుకున్న కుటుంబ ద్రోహి జగన్‌రెడ్డి. వివేకానందరెడ్డి కుమార్తె సునీతరెడ్డి న్యాయపోరాటాన్ని ఎగతాళి చేయడమే కాకుండా, న్యాయపోరాటం ఆపేయాలని బెదిరించిన కర్కోటకుడు జగన్. సొంత చిన్నాన్నను దగ్గరుండి హత్య చేయడంలో కీలకపాత్ర పోషించిన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా భుజాలకెత్తుకున్నాడు. ఓ హంతకుడు అమాయకుడు అని రాష్ట్ర ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశాడు. ఇలాంటి వ్యక్తికి గొడ్డలి వేటులో పోటుగాడు అనే బిరుదు ఇవ్వకపోతే వివేకానందరెడ్డి ఆత్మ ఘోషిస్తుంది.
‘‘తల్లి, చెల్లి సెంటిమెంటు లేని సిల్లీ ఫెలో’’ జగన్:
ఆస్తుల విషయంలో తల్లి, చెల్లి అనే సెంటిమెంటు లేని సిల్లీ ఫెలో అని జగన్మోహన్‌రెడ్డి తనను తాను పలుసందర్భాల్లో నిరూపించుకున్నాడు. ఆస్తులు అడిగిన చెల్లిని, చెల్లికి తోడుగా నిలిచిన తల్లిని మెడపట్టి ఇంట్లో నుండి గెంటేసిన పుత్రరత్న జగన్‌రెడ్డి. ప్రాణభయంతో తన ఇంటినే కాదు, రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిన దుస్థితిని సొంత తల్లి విజయలక్ష్మికి తీసుకొచ్చిన ఘనాపాటి జగన్ రెడ్డి. ఆస్తుల కోసం తల్లిని కోర్టుకు ఈడ్చి నీచాతి నీచమైన వ్యక్తుల జాబితాలో అగ్రతాంబూలం అందుకున్న అగ్రగణ్యుడు జగన్ రెడ్డి. సొంత చెల్లిపై తన పేటీఎం కుక్కలతో సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెట్టించి, తన తల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించి శునకానందం పొందిన శునకనంద రత్న జగన్‌రెడ్డి. ఇలాంటి వ్యక్తికి తల్లి, చెల్లి సెంటిమెంట్‌లేని సిల్లీ ఫెలో అనే బిరుదు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలోని తల్లులు, చెల్లెళ్లు బాధపడతారు.
‘‘అబద్దాలు చెప్పడంలో ఆస్కార్’’ జగన్:
జరిగింది జరగనట్టు చెప్పడం, జరగనిది జరిగినట్టు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డిది అందెవేసిన చెయ్యి. తాను చేసిన తప్పులను ఎదుటివారికి అంటగట్టడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. తాను అబద్దం చెబుతున్నట్టు అబద్దానికి కూడా అనుమానం రాకుండా చెప్పగలిగే అబద్దాలరత్న జగన్‌రెడ్డి. ముఖం దీనంగా పెట్టి, తనకు తప్పు అంటే ఏంటో తెలియదు అన్నట్టు ముఖంలో భావ వ్యక్తీకరణ చూపించడం, తనకు వచ్చీరాని తెలుగులో నత్తినత్తి పదాలతో ప్రజలకు తాను ఏం చెబుతున్నాడో అర్థం కాకుండా చెప్పడంలో తనకు తానే సాటి… అతనే జగన్మోహన్ రెడ్డి. సుదీర్ఘమైన ప్రసంగాలతో పొంతనలేని విషయాలతో ప్రజలను నిత్యం అయోమయానికి గురిచేయడం జగన్ ప్రత్యేకత. చెప్పిన అబద్దాన్నే… పదేపదే చెప్పి అబద్దాన్ని నిజమని నమ్మించడంలో జగన్ దిట్ట. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి… ప్రజలపై అప్పుల భారాన్ని మోపి… ప్రజల కోసమే తాను పుట్టినట్టు పేద ప్రజలను నమ్మించడంలో జగన్మోహన్ రెడ్డికి మరెవరూ సాటి రారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా అక్కచెల్లెమ్మలు, నా రైతన్నలు, విద్యార్థులంతా నా మేనల్లుళ్లు, మేనకోడళ్లుఅంటూనే వాళ్ల భవిష్యత్తును సర్వనాశనం చేసి, తనకేమీ తెలియనట్టు నటించడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన నటుడు మరొకడు ఉండడు. అందుకే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అందుకే కూటమి ప్రభుత్వం ఓసారి ఆలోచించి ఇన్ని విశిష్ట దుష్ట లక్షణాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఆస్కార్ అవార్డు ఇచ్చి సన్మానించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
`మునీంద్ర కొడాలి, పొలిటికల్ ఎనలిస్ట్