- ఎక్సైజ్ శాఖలో దుర్వినియోగం అరికట్టాలి
- పలు పారామీటర్లతో నాణ్యతను చెక్ చేస్తున్నాం
- డిజిటల్ పేమెంట్లపై ఐవీఆర్‌ఎస్ సర్వే చేద్దాం
- ఇసుక అందుబాటుపై 86 శాతం సంతృప్తిగా ఉన్నారు
- టన్ను ఇసుకా బయట రాష్ట్రాలకు తరలకూడదు
- రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణే పెద్ద సవాల్
- డీ ఎడిక్షన్, రిహాబిలిటేషన్ సెంటర్లపై దృష్టిపెట్టాలి
- ఈగల్‌ను ఏర్పాటు చేశాం..ప్రతి ఏడాది నిధులిస్తాం
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలకు సంబంధించి హోల్ సేల్ లిక్కర్ తయారీ మొదలు కుని రిటైల్ విక్రయదారు వరకు అక్రమాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమ్మకాల్లో నగదు లావాదేవీలు చేశారు తప్ప ఎక్కడా డిజిటల్ లావాదేవీలు చేయలేదు..ఈ అంశాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరు గుతోందని వెల్లడిరచారు. రెండోరోజు గురువారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎక్సైజ్, గనుల శాఖలపై సమీక్షించారు. రాష్ట్రం నుంచి టన్ను ఇసుక కూడా బయటి రాష్ట్రాలకు వెళ్లడానికి వీలులేదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక విషయంలో కూడా అవకతవకలు జరిగాయి.. సమస్యలను సరిదిద్దామని వివరించారు. సీనరేజీ తీసేశాం కాబట్టి అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. రాత్రి వేళ ఆపి ఉదయం తనిఖీలు చేయా లని, నెలకు ఒకసారి సమావేశం పెట్టి ధర తగ్గించడానికి అన్ని మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధు లు ఎవరూ ఇసుక విషయంలో తలదూర్చకూడదని స్పష్టం చేశారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజా స్పందనను తీసుకుంటున్నామని 86 శాతం సంతృప్తికరంగా ఉందని తెలిపారు.
డిజిటల్ పేమెంట్లపై ఐవీఆర్‌ఎస్ సర్వే
పలు పారామీటర్లతో లిక్కర్, బీర్ నాణ్యతను చెక్ చేస్తున్నాం..ఎక్సైజ్ శాఖలో దుర్వినియోగం అరికట్టాలని ఆదేశించా రు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కంట్రోల్ చేయాలని సూచించారు. సరిహద్దుల దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ పేమెంట్లు చేస్తున్న వారి నెంబర్లు తీసుకుంటే ఐవీఆర్‌ఎస్ సర్వే చేద్దామని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై దృష్టిపెట్టాలి
ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చాం. మిగిలిన నేరాలను నియంత్రించగలిగాం కాని గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైన వారిని మార్చడం చాలా కష్టం. గంజాయి సేవించిన వారు తల్లిదండ్రులపైనే దాడులకు పాల్పడుతున్నారు. లైంగిక వేధిం పులు అనేవి గంజాయి, డ్రగ్స్, సెల్‌పోన్ల కారణంగా జరుగుతున్నాయి. అన్ని జైళ్లలో 80 శాతం మంది గంజాయి, డ్రగ్స్ నిందితులే ఉన్నారు. గత ఐదేళ్లలో గంజాయిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే వీళ్లు మరింత రెచ్చిపోతారు. గంజాయికి చిరునామా ఇప్పుడు ఏపీ కాదు..మనం తగ్గామని తెలిపారు. డీ అడిక్షన్, రిహాబిలిటేషన్ సెం టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మనకు ఇదొక పెద్ద సవాల్. ఈ మూడిరటిపై మరింత ఫోకస్ పెట్టండి, దీనిపై వెనక్కి తగ్గేదిలేదు, జీరో టాలరెన్స్ మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ నిందితులు జైళ్లకు వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారనేది పర్యవేక్షించాలి. క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించాం. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తాం.. వైద్య ఆరోగ్యశాఖ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. డి ఎడిక్షన్ కేంద్రాలకు తగిన నిధులు సమకూర్చడం జరుగుతుంది. మద్యం అమ్మకాలపై 2 శాతం సెస్ వసూలు చేస్తున్నామని తద్వారా సుమారు రూ.150 కోట్లు సమకూరనున్నాయని, ఆ నిధులను ఇందుకోసం కేటాయిస్తామని తెలిపారు. ఈ కేంద్రాల్లో కొంతమంది నిపుణులైన డాక్టర్లు, మానసిక వైద్యులను నియమించుకుని బాధితుల్లో పరివర్తన తీసుకువచ్చేలా కృషి చేయాలని చెప్పారు.
నాటుసారా రహిత రాష్ట్రానికి కార్యాచరణ
అంతకుముందు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా ఇసుక, మద్యంపై సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు వివరించారు. జనవరి మొద టివారంలో రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా ప్రకటించే విధంగా కార్యాచరణ చేపట్టామని చెప్పారు. కర్నాటక, గోవా, యానాం రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని 39 చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.