అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఆ ప్రాంతవాసుల ఆకాంక్షల మేరకే చంద్రబాబు అక్కడ ఏర్పాటుచేశారు. అయితే కేవలం అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడమంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయడం అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదు. అభివృద్ధి కేంద్రీకరణ విషయంలో గతంలో ఉన్న న్యాయ భావన ఇప్పుడు లేదు. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఆ భావనకు తావు లేకుండాపోయింది. వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రాయలసీను కరువు పీడిత ప్రాంతం ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉంది. ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసింది. అమరావతిలోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం ద్వారా తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారని, కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో వెనుకబడిన రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదిశగా కొంతమేరకు కృషి చేశారంటూ కుహనా మేధావి ప్రొఫెసర్ హరగోపాల్ రాజధాని అమరావతిపై విషం కక్కారు.
కుహనా మేధావులు సంఘటితంగా ఏర్పడి రాజధాని అమరావతిపై ఇంకా ఎంత కాలం నీచమైన, అసత్యాలతో కూడిన ప్రచారం చేస్తారో, ఎన్నాళ్ళు విషం కక్కుతారో, నీలి మీడియా, కూలి మీడియా ఇంకా ఎంత కాలం రోత రాతలు రాస్తుందో, విష ప్రచారం చేస్తుందో అర్ధం కావడం లేదు. దిక్కుమాలిన సాక్షి మీడియా అమరావతి మీద విషం కక్కటంలో అది వైసీపీ పక్షపాతమని సరిపెట్టకోవచ్చు. కానీ ఈ దిక్కు మాలిన మేధావులు కూడా అమరావతి మీద అవగాహన లేక మాట్లాడుతున్నారా? అల్పబుద్దితో మాట్లాడుతున్నారా? ఉద్దేశ పూర్వకంగా విషం చిమ్ము తున్నారో అర్థం కావడం లేదు. సదస్సుల పేరుతో ఆంధ్రప్రదేశ్ వచ్చిన పనికిమాలిన, పనికిరాని మేధావులు అమరావతిపై విషం కక్కడం మళ్ళీ మొదలు పెట్టారు. సదస్సుల కోసం వచ్చిన వారు సదస్సు చూసుకొని వెళ్లిపోవాలి. అంతే తప్ప అమరావతిపై విషం కక్కడం ఏమిటి? రోత మీడియా ఏదో అడిగిందని అమరావతిపై అసంబద్ధమైన వాగుడు వాగుతారా? ఒక పక్కన 11 ఏళ్లుగా రాజధాని లేకుండా పడి వుంది. బాధ్యత ఎరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకొంటుంటే చూడలేని కబోధులు, కొంత మంది కుహనా మేధావులు మళ్లీ పాత పాట మొదలెట్టారు. అమరావతి రాజధానిపై విషం కక్కడమే తమకు ప్రధానమని, మేధావుల ముసుగులో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఇలాంటి వారిని సదస్సుల పేరుతో మాజీ సియం జగన్ రెడ్డి.
పక్క రాష్ట్రం నుంచి కిరాయి ఇచ్చి దిగుమతి చేసుకొని అమరావతిపై విషం కక్కిస్తున్నారనేది నిర్వివాదాంశం. వైసిపి, తన రాజకీయ ప్రయోజనం కోసం కిరాయి మేధావులను పోషిస్తున్నది. ఆయా అంశాలపై అవగాహన ఉన్నా, లేకపోయినా నిస్సిగ్గుగా తమ వాదనలను వండి వారుస్తున్నారు ఈ బాడుగ మేధావులు, ఇలాంటి కుహనా మేధావుల వల్ల సమాజానికి చేటు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. సమస్య తీవ్రతను బట్టి లోతుగా విశ్లేషించడం మానేశారు. కిరాయి, కుహనా మేధావులు. మిడిమిడి జ్ఞానంతో రాజకీయ రంగలోకి చొరబడి వారికి నచ్చిన వారికి ప్రయోజనం కల్పించడానికి భజనలు చేస్తున్నారు. అమరావతిపై అదేపనిగా విషం కక్కుతున్నారు. అనుభవశీలురైన వారు కూడా కేవలం స్వార్థ్ధబుద్ధితో ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడానికి అబద్ధాలను నిజాలుగా, చెడును మంచిగా నమ్మించే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యం. మేధావులుగా చలావణీ అవుతున్న ఇటువంటి కుహనా మేధావుల్లో నైతిక విలువలు, ఆలోచనలు అడుగంటి పోయాయి. ఇటువంటి కుచిత మేధావుల సంఖ్య పెరిగిపోయింది. వీరు ప్రవచించే నీతులు, సుద్దులతో నిజాలు మరుగున పడుతున్నాయి. వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు చెప్పలేని మేధావులు ఎవరికోసం? ఉగ్రవాదులు వల్ల వచ్చే ప్రమాదం కన్నా, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ మరొక రాజకీయ పార్టీకి మేలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ కుహనా మేధావుల వల్లనే అతి పెద్ద ప్రమాదం పొంచి వున్నదని చెప్పక తప్పదు. ఇటువంటి మేధావులు పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి.
అమరావతి పేరుతో మళ్లీ అదే తప్పు అని, రాయలసీను కరువు పీడిత ప్రాంతం, ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉన్నాయని, రాయలసీమకు నదీ జలాలను మళ్లించే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొంతమేర కృషి చేయగలిగారనే దానిని కాదనలేం అని, రాయలసీమ, ఉత్తరాంధ్రాపై మొసలి కన్నీరు కార్చిన పనికి మాలిన మేధావి ప్రొఫెసర్ హరగోపాల్.
రాయలసీమ అభివృద్దికి కృషి చేశారని మీరు కీర్తించిన పెద్ద మనిషి హరగోపాల్ వైఎస్ చేసిందేమిటో చెప్పగలరా? ప్రాంతాల మధ్య విషం పోసి విద్వేషాలు రెచ్చగొట్ట డానికి రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రజలను సిద్ధం చేస్తున్నారీ కుహనా మేధావులు. రాయలసీమను అభివృద్ధి బాట పట్టించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తాగునీటి వసతుల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉధ్యోగాల కల్పనకు అవసరమైన కార్యాచరణ రూపొందించిందే తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ కుహనా మేధావి తెలుసుకోవాలి. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులకు రూప కల్పన చేసింది ఎన్టీఆర్ అని మర్చిపోయారా? రాజకీయాన్ని వ్యాపారమయం చేసి, దగాకోరు విధానాలతో ప్యాక్షనిజం, రౌడీయిజాలతో ధనార్జనే ధ్యేయంగా రాయలసీమను గాలికి వదిలేసిన చరిత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి, తనయుడు జగన్‌రెడ్డిది అని ఈ కిరాయి మేధావి తెలుసుకోవాలి. వెనుకబడ్డ రాయలసీమలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ అభివృద్ధికి టీడీవీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది.
ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ కూడా రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేష కృషి చేసీన విషయం తెలుసుకోవాలి ఈ మేధావి. విభజన అనంతరం గత ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. నాడు వలసలకు నిలjమైన అనంతపురం జిల్లా నేడు కొలువులకు నిలయంగా మారింది.
నిత్యం కరువు జిల్లాగా పేరొందిన జిల్లా కార్ల ఖిల్లాగా మారింది. నాడు కరువు జిల్లా అనంతపురంలో కియా వంటి కార్ల పరిశ్రమ 11 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించడానికి చంద్రబాబు పట్టుదల, నిరంతర శ్రమే కారణం. చంద్రబాబు ఏర్పాటు చేసిన కియా కార్ల కంపెనీతో ఏపీ బ్రాండ్ మార్మోగింది. మరి అయిదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు అయిందా? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అయిదేళ్లలో రూ 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు తప్ప రాయలసీమ వాసిగా ఆ ప్రాంతాన్ని ఉద్ధరించిందేమిటో ఈ కుహనా మేధావి హరగోపాల్ చెప్పాలి?. వ్యవసాయ భూములకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి సదుపాయం కల్పించి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి కరువు ప్రాంతమైన రాయలసీమను ఉధ్యాన కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం.
నదుల అనుసంధానంతో రాయల సీమకు సాగునీరు అందించి రతనాల సీమగా మార్చడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కరువు కాటకాలతో మగ్గిపోయే రాయలసీమను కరువు రహిత సీమగా మార్చేందుకు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసింది సాక్షాత్తూ చంద్రబాబే. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను రాయలసీమ ప్రాంతానికి మళ్లించి ఆ ప్రాంతంలో కరువును రూపుమాపాలని ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని అధికారులను, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు చంద్రబాబు. పోలవరం పూర్తయ్యే వరకు ఆగకుండా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని రాయలసీమకు మళ్లించి నీటివెతల నుంచి దూరం చేసేందుకు ఉద్దేశించి చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా వైపునకు తరలించి, డెల్టాకి వచ్చే నీటిని శ్రీశైలంలో నిలిపి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు 451 టీఎంసీల నీటిని తరలించిందీ, రాయలసీమలో కరువు ప్రాంతాలను ఆదుకొన్నదీ గత ప్రభుత్వం కాదా? విభజన కారణంగా మిగులు జలాల ఆధారంగా నిర్మాణం చేపట్టిన తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులకు నీరు లభించని దుస్థితి నెలకొన్నది. అందుకే పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని మళ్లించి డెల్టాకు వచ్చే నీటిని రాయలసీమకు సత్వరం మళ్లించి మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చెయ్యాలని పనులను పరుగులు తీయించారు చంద్రబాబు.
హంద్రీ-నీవా పూర్తిచేసి చిత్తూరు జిల్లా కుప్పం వరకు తాగు, సాగునీరు అందించాలని, అలాగే గాలేరు-నగరి పూర్తిచేసి గండికోట నీటిని పులివెందుల వరకు తరలించారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసి రాయల సీమను ఆదుకొనేందుకు గోదావరి, పెన్నాను అనుసంధానం చేయాలని సంకల్పించారు. దీని ద్వారా 320 టీంసీలు గోదావరి జలాలు మళ్లించి రాయల సీమకు సాగునీరు అందించేందుకు వైకుంఠపురం ప్రాజెక్టుకు గత తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మోకాలడ్డి నిలిపేశాడు. మిగులు జలాలు, నికర జలాలు అడగబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2006 మార్చి 2వ తేదీన రాసిన లేఖ రాసి ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొట్టారు. ఆ వైఎస్ రాజశేఖరరెడ్డి రాయల సీమకు మేలు చేసిన వాడిలా కనిపిస్తున్నాడా ఈ కుహనా మేధావికి. జగన్ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పడకేసాయి. హంద్రీ-నీవా-సుజల స్రవంతి, గాలేరు-నగరి, వెలిగొండ, స్వర్ణముఖి, గుండ్రేవుల, గండికోట రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు గాలిలో దీపాలయ్యాయి.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు. రాయలసీమలో వ్యవసాయం గాలిలో దీపమై పనులు లేక ప్రజలు వలస బాట పట్టారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు జలకథలు వినిపించి రాయలసీమ రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసి రాయల సీమ ద్రోహిగా మిగిలి పోయాడు. ఇప్పటికైనా పనికిమాలిన మేధావులు సదస్సుల పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాజధాని అమరావతిపై పనిగట్టుకుని విషం కక్కడం మానాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి బ్రతుకు ఏదో వారు బ్రతుకు తున్నారు. సదస్సుల కోసం వచ్చిన వారు, ఇతర పనులు కోసం వచ్చిన వారు, ఎవరి పనులు వారు చూసుకొని, ఆంధ్రులు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. అంతే తప్ప రాజధాని అమరావతిపై విషం కక్కడం, పుల్లలు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పనికి మాలిన మాటలు మానండి.
నీరుకొండ ప్రసాద్