ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ‘సౌర పొద్దు’ పొడవనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్యఘర్ పథకానికి కుప్పం కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. నియోజకవర్గంలో ఉన్న సుమారు 50 వేల విద్యుత్ కనెక్షన్లు త్వరలోనే సౌర విద్యుత్‌తో అనుసంధానం కానున్నాయి. గృహ విద్యుత్ కనెక్షన్లను సౌర వ్యవస్థతో అనుసంధానించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సీఎం సొంత నియోజకవర్గంలో ప్రారంభం కానుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో సంక్షేమం, ప్రగతి రథ చక్రాలపై రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. వైసీపీ పాలనలో నాయకులు రాష్ట్రంలోని వ్యవస్థలను, సహజ వనరులను నాశనం చేశారు. కేంద్రం కేటాయించిన పథకాలు, ఇచ్చిన నిధులు ఖర్చు పెడితే సమాధానం చెప్పుకోవాల్సి ఉం టుందని వాటిని వద్దని చెప్పి పంపిన ఐదేళ్ల నియంత పాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలం దరూ కళ్లారా చూశారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఎలాంటి అద్భుతాలు చేయవచ్చనేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటి అద్భుతాల్లో ఒకటే కుప్పంలో ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఇంటింటా సోలార్ యూనిట్ ప్రాజెక్ట్.
జగన్‌రెడ్డి చేసిన పాపాల కారణంగా విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయింది. దీని పర్యవసానంగా వైసీపీ హయాంలో 10 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. అంతటితో ఆగకుండా వారు అధికారం దిగిపోయిన తరువాత కూడా ట్రూ అప్ చార్జీల పేరిట మోత మోగిస్తున్నారు. అయితే విద్యుత్ ఛార్జీల మోతతో ఇబ్బంది పడే ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకం ఇప్పుడు ప్రజలకు వరంలా మారింది. రెండేళ్ల క్రితం నుంచే ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ నాటి పాలకుల అనాలోచిత నిర్ణయం వల్ల ఏపీలో పనులు ఊపందు కోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు ముందు చూపుతో సౌర విద్యుత్‌పై ఫోకస్ పెట్టారు. కేంద్ర సాయంతో ఇంటింటా సౌర వెలుగులు నింపేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఇంట్లో అవసరమైన విద్యుత్ వాడుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను అమ్ముకునే వెసులు బాటు కూడా కల్పించనున్నారు.
పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే అవకాశాలను వందకు వంద శాతం వాడుకుని ప్రజలకు మేలు జరిగేలా చేయాలన్న ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించడం లేక అసలు లేకుండా చేయాలనే విధానంతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నారు. ప్రతీ ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే ఆశయంతో ముందడుగు వేస్తు న్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో వంద శాతం సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసి మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నారు.
ఒకప్పుడు కరవు ప్రాంతంగా ఉన్న కుప్పంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వా త డ్రిప్ ఇరిగేషన్‌ను అక్కడ ప్రోత్సహించారు. దీంతో అక్కడ సిరులు పండుతున్నాయి. దాన్ని ఆదర్శంగా తీసుకున్న మరిన్ని ప్రాంతాల రైతులు డ్రిప్ ఇరిగేషన్‌ను పెట్టించుకుని కరవును పారద్రోలారు. అదే మోడల్‌ను చంద్రబాబు మరోసారి పీఎం సూర్యఘర్ ద్వారా అమలు చేస్తున్నారు. అక్కడ వందకు వంద శాతం సోలార్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో భారీ ఎత్తున సోలార్ విద్యుత్ యూనిట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ మహా క్రతువును ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ పరిధిలో అధికారులు ఇప్పటికే సర్వే చేపట్టారు. రూఫ్‌టాప్ ఉన్న 53,314 గృహాలకు 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు జరుగుతుంది. ఈ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లకు సోలార్ పవర్‌తో కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ సర్వీసులను సైతం సౌర విద్యుత్తులోకి మార్చే ప్రతిపాదన లు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రజల అవసరాలకు సరిపడా పోగా మిగులు విద్యుత్‌ను మళ్లీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం నెట్ మీటరింగ్ వ్యవస్థను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టే ఈ పథకంలో కేంద్రం 60 శాతం ఖర్చు భరిస్తే మా కూటమి సర్కారు మరో 40 శాతం ఖర్చు చేయనుంది. నియోజకవర్గం మొత్తం సోలార్ విద్యుత్ పరిధిలోకి తీసుకురావాలంటే రూ.వెయ్యి కోట్లు ఖర్చు కానుంది. ఇప్పుడు కొంతమేర పెట్టుబడి పెట్టినా భవిష్యత్‌లో ప్రజలకు మేలు జరుగుతుందనే భావ న. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటును పూర్తిస్థాయిలో వినియో గించుకోగలం అనే నమ్మకం కూడా ఉంది. ఇలాంటి ఆలోచన లేని నాటి జగన్ సర్కారు అసలు ఈ పథకమే తమకు అవసరం లేదని చెప్పి వెనక్కి పంపే ప్రయత్నం కూడా చేసిం ది. ఇది జగన్ అవగాహన రాహిత్యానికి, అనాలోచిత పాలనకు పరాకాష్ట.
ఈ పథకం ద్వారా కేవలం కుప్పంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రాంతాల్లోనూ పీఎం సూర్యఘర్‌పై అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై భారం పడకుండా చూసేందుకు పీఎం సూర్యఘర్ ఎంతగానో మద్ద తుగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇచ్చే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ భారం ప్రభుత్వంపై పడుతోంది. వాళ్లందరినీ సోలార్ విద్యుత్ వైపు తీసుకురాగలిగితే ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుంది. అందుకే పీఎం సూర్య ఘర్ పథకంలో చేరేలా ప్రజలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం రాయితీలను కూడా కల్పిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ సౌరభాలు వెలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీతంపేట మన్యంలో కూడా రానున్న రోజుల్లో సౌర వెలుగు కనిపించనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎస్టీ, ఎస్టీ గ్రామాల్లో సర్వే చేసిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాల్లో 21,302 ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూటమి ప్రభుత్వం భరించనుంది.
తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ సోదరులకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువే. ఇందులో భాగంగానే ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన కొండపిలోని తూర్పునా యుడుపాలెం గ్రామాన్ని కూడా త్వరలోనే సోలార్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశాము. అతి త్వరలోనే ఈ గ్రామాన్ని ఆదర్శ సోలార్ గ్రామంగా మార్చేందుకు అడుగులు చకచకపడుతున్నాయి. అంతేగాకుండా ప్రకాశం జిల్లాలోని మరో రిజర్వుడు నియోజకవర్గం అయిన యర్రగొండపాలెం నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న ఎస్టీ గ్రామాలకు, తండాలకు, రిజర్వ్ జోన్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సౌర విద్యుత్‌ను పరిచయం చేయనున్నాం. ఈ ప్రయత్నం ద్వారా ఆయా ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరాను కూటమి ప్రభుత్వం అందించనుంది. అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై వంద శాతం సోలార్ యూనిట్లను అమర్చే క్రతువును రానున్న ఐదేళ్లలో పూర్తి చేయాలని భావిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన పథకం ద్వారా ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తోంది. ఒక్కో కిలో వాట్‌కు రూ.30 వేలు సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు అయితే రూ.78 వేలు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. అంటే మూడు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందు లో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు పొందొచ్చు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకానికి డిసెంబర్ వరకు దాదాపు 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇందులో టాప్‌లో గుజరాత్ ఉంది. తర్వాత స్థానం మహారాష్ట్రది. జగన్‌రెడ్డి చేతకానితనంతో ఏపీకి పీఎం సూర్యఘర్ ఊసే లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆశించిన మేరకు రాలేదని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఓ నివేదికలో వెల్లడిరచింది. కానీ నేడు ప్రభుత్వం మారింది.. పరిస్థితులు మారాయి. పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ను టాప్‌లో ఉంచాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ముందు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టారు.
– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్