- ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో తిరిగి మంచిరోజులు
- అనుమతులకు సింగిల్ విండో విధానం
- పెట్టుబడిదారులకు పూర్తి భరోసా
- ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ (చైతన్యరథం): ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీలో పర్యాటక రంగానికి స్వర్ణయుగం నడుస్తోందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సరికొత్త విధానాలతో ఏపీ పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 15 నెలల కాలంలో పర్యాటక రంగంలో రూ. 10,644 కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. పర్యాటక రంగం సుస్థిర మార్పు అనే ఈ ఏడాది థీము సీఎం నేతృత్వంలో నిజం చేస్తున్నాం. ఆయనే మాకు స్ఫూర్తి. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో
పర్యాటక రంగానికి పునర్ వైభవం వచ్చిందంటే అందుకు సీఎం చంద్రబాబు నేతృత్వమే కారణం. తొలి నుండి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారు. సీఎం సూచనలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యాటకాన్ని వృద్ధి చేస్తున్నాం.
2019–24 కాలంలో పర్యాటక రంగం కుంటుపడింది. ఆనాటి పాలకుల అనాలోచిత విధానాలతో పర్యాటకాభివృద్ధి పూర్తిగా పడకేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హెూదా కల్పించడం శుభ పరిణామం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 2024-29 పర్యాటక పాలసీకి మంచి స్పందన వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అఖండ గోదావరి, గండికోట పర్యాటక ప్రాజెక్టులు, సూర్యలంక బీచ్ అభివృద్ధి, అన్నవరం, అహోబిలం, సింహాచలం దేవాలయాల అభివృద్ధి, బొర్రా గుహలు, నాగార్జున సాగర్ అభివృద్ధి చేస్తున్నాం. ఏపీ పర్యాటక రంగంలో క్యారవాన్ టూరిజం పాలసీ, హెూమ్ స్టే పాలసీ, ల్యాండ్ పాలసీ, అడ్వెంచర్ పాలసీ, ఎంప్లాయిమెంట్ ఇన్సెంటివ్ పాలసీ ప్రవేశ పెట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
పెట్టుబడిదారులకు పూర్తి భరోసా
ఇన్వెస్టర్లకు గత ప్రభుత్వంలా బెదిరింపులు ఉండవు. పర్యాటకంలో సింగిల్ విండో విధానాలు అమలు చేస్తూ త్వరతగతిన అనుమతులు జారీ చేస్తున్నాం. ఏపీ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్తో పాటు పర్యాటకాంధ్ర ప్రదేశ్ గా మారుస్తాం. ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వస్తే.. భరోసా కల్పించే బాధ్యత మాది. ఏపీలో పెట్టుబడులు పెడితే ఆదాయంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదం అందిద్దాం. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో, పర్యాటకం వృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. ఏపీలో అలాంటి వాతా వరణం కల్పించిన దార్శనికుడు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వం లో ఏపీ పర్యాటకంగా దూసుకెళుతోంది. ఏపీలోని సముద్ర తీరంలో, ప్రకృతి సహజ సిద్ధ సుందర ప్రాంతాల్లో, చారిత్రత్మాక కోటల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఏపీ పర్యాటకానికి మంచి టీమ్ దొరికింది.. వారందరి కృషితో పురోగతి సాధిస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు.
గ్లోబల్ టూరిజం హబ్గా ఏపీ: నూకసాని బాలాజీ
ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మన రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్ తీర్చిదిద్దడానికి అద్భుతమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, అరకువ్యాలీ, రాజమహేంద్రవరం, తిరుపతి, అమరావతి, గండికోట, శ్రీశైలం ఈ ఏడు ప్రాంతాలను టూరిజం పాలసీలో భాగంగా టూరిజం హబ్ లుగా అభివృద్ధి చేయనున్నామన్నారు. ఈ రంగంలో 105 ఎంఓయులను ఇప్పటికే చేసుకున్నామని, దీని ద్వారా రూ. 10వేల కోట్ల కుపైగా పెట్టుబడులు రానున్నాయన్నారు. పీపీపీ పద్దతిలో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు.
టూరిజం శాఖ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ టూరిజంకు ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ హెూదా ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త టూరిజం పాలసీని కూడా తీసుకువచ్చామన్నారు. టూరిజం రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు టూరిజం రంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పట్టణంలో విజయవాడ ఉత్సవ్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తుండటం హర్షనీయమన్నారు. ఈ ఏడాది విశాఖ, సూర్యలంక తదితర ప్రాంతాల్లో 8 ఉత్సవ్ లు నిర్వహించనున్నామన్నారు. ఉపాధి కల్పనకు టూరిజం రంగం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే ఈ ఏడాది 20 శాతం గ్రోత్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రపంచ, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా వివిధ కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు.
ముందుగా టూరిజం కార్వాన్ వాహనాల శ్రేణిని సీఎం చంద్రబాబు నాయుడు జండా ఊపి ప్రారంభించారు. అలాగే కేరళ రాష్ట్రంలోని హౌస్ బోట్ ఆపరేటర్స్ తో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. స్వదేశీ దర్శన్ 2.0 స్కీం ఫౌండేషన్ స్టోన్ ను ఆవిష్కరించారు. ప్రదర్శనలో భాగంగా పర్యాటక శాఖ రూపొందించి ప్రదర్శించిన ఏవీ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏపీ టూరిజం పాలసీ ఆపరేషన్ గైడ్ లైన్స్న సీఎం చంద్రబాబు విడుదల చేశారు. బాపట్ల గోల్డెన్ శాండ్ బీచ్ ను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఏపీ టూరిజం హెూం స్టే పోర్టల్ ను కూడా విడుదల చేశారు. అనంతరం అరకు పాడేరు, అస్సీల్మెట్ట (విశాఖపట్నం), కోనసీమలోని మలికిపురం లలోని హెూం స్టే యజమానులతో పర్చవల్ గా మాట్లాడారు. చివరగా రాష్ట్ర పర్యాటక ఎక్స్టెన్స్ అవార్డులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందచేశారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ హెూటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్. వి. స్వామి, రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ పొడపాటి తేజస్వని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, బాపట్ట జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్, స్టేక్ హెూల్డర్లు, అధికారులు, అవార్డు గ్రహీతలు, తదితరులు పాల్గొన్నారు.