మంగళగిరి (చైతన్య రథం): మంగళగిరి ఎస్‌ఎల్‌ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు (ఎస్‌ఎల్‌ఎన్ పార్క్)ను మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. 0.35 ఎకరాల్లో విస్తరించివున్న పార్క్‌ను రూ.1.06 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా లోకేష్ స్థానికులతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మంగళగిరిలోని టిడ్కో పార్క్‌ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన పనులను కూడా ఈనెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. నులకపేట, చినకాకానిలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్‌కి అందుబాటులోకి తెస్తామని లోకేష్ వెల్లడిరచారు. కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.