అమరావతి (చైతన్యరథం): ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలుగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ప్రమాణం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్‌రాజు ఛాంబర్‌లో ఆమెతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసన మండలి నియనిబంధనలకు సంబంధించిన కిట్‌ను ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, గ్రీష్మ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.