ముప్పాళ్ల/ నందిగామ (చైతన్య రథం): బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య తదితరులతో కలిసి వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. పీఎం ఏజేఏవై నిధులు రూ.5.75 కోట్లతో వెల్లటూరు గ్రామంలో నిర్మించనున్న ఫుట్‌వేర్ తయారీ యూనిట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ నిధులు రూ.58.14 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా (గురుకులం, ఎస్‌సీ హాస్టళ్లు) 1938 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 221 ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌వో ప్లాంట్ల ద్వారా తాగునీటి సరఫరా పథకం (హాస్టళ్లు 100, గురుకుల పాఠశాలలు-53) పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు.