- సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలి
- పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలి
- నోడల్ అధికారులను నియమించాలి
- అధికారులకు సీఎస్ విజయానంద్ ఆదేశం
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై సమీక్ష
అమరావతి(చైతన్యరథం): సులభతర వాణిజ్యం విషయంలో రాష్ట్రం గత పదేళ్లలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటిస్థానంలో నిలవడం జరిగిందని, ఆ స్థానాన్ని నిలబె ట్టుకునేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (జుశీణదీ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపిం చిన ర్యాంకింగ్ వ్యవస్థగా పేర్కొంటూ.. వ్యాపారాలకు మెరుగైన, సాధారణంగా సరళ మైన, నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుం దని తెలిపారు. 2024లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టు బడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ దిశగా ఆయా శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి ఏపీికి ఉన్న మొదటిస్థానాన్ని నిలబెట్టుకు నేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం బిజినెస్ రిఫార్స్మ్ యాక్షన్ ప్లాన్ 2024కు సంబంధించి ఫిబ్రవరి 15 తుది గడువుగా పెట్టిందని, 10వ తేదీలోగా సంబంధిత శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించిన కంప్లయెన్స్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి ఇంకా కొన్ని శాఖలు నోడల్ అధి కారులను నియమించాల్సి ఉందని, ఆ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. అంత కుముందు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బిజినెస్ రిఫార్స్మ్ యాక్షన్ ప్లాన్ 2024కు 28 శాఖలకు చెందిన 58 అంశాల్లో 435 రిఫార్మ్స్‌కు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికే చాలావరకూ రిఫార్స్మ్ కంప్లయన్స్ చేశారని మిగ తా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా శాఖలకు సూచించారు. ఫిబ్రవరి 15 తుది గడువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున ఈ అంశానికి సంబంధించి పలు అంశాలపై సంబంధిత శాఖలు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ అభిషిక్త్ కిషోర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ హరినారాయణ, న్యాయశాఖ అదనపు కార్యదర్శి వి.సునీత పాల్గొన్నారు. అదే విధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా, అనంతరాము, వాణీిప్రసాద్, ముఖ్యకార్యదర్శులు ఎస్.సురేశ్‌కుమార్, శశిభూషణ్‌కుమార్ తదితర అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.