అమరావతి (చైతన్యరథం): మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కొంత కాలంగా ఆయన పరారీలో ఉన్నారు. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఆజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. విడదల రజని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేటలో మొత్తం దందాలు ఆయనే నడిపారు. యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో రజనితో పాటు ఆయన నిందితుడిగా ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల పాటు ఆయన చేసిన అరాచకం గతంలో ఎవరూ చేయలేదన్న విమర్శలు నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చాయి.