- చారిత్రాత్మక పాదయాత్రకు మూడేళ్లు..
- వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం
- యువనేత ఉక్కు సంకల్పానికి జన నీరాజనం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిం ది. జగన్మోహన్రెడ్డి అరాచక పాలనపై యువగళం పాదయాత్ర ద్వారా సమరశంఖం పూరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చే శారు. 2023 జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/ మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కి.మీ మేర కొనసాగింది. యువగళం పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఉద్యోగాల్లేక నిరాశ, నిస్పృహలతో ఉన్న యువత ఒకవైపు… భద్రత కరువైన మహిళలు మరోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకుభారంగా మారిన జన సామాన్యం ఇంకోవైపు.. వీరందరికీ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు యువనేత లోకేష్, ప్రజల కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర ప్రజల్లో చైతన్యం నింపింది.
కోటిన్నర మందిని నేరుగా కలిసిన యువనేత
యువగళం పాదయాత్ర జగన్మోహన్రెడ్డి మాదిరి శని, ఆదివారాల్లో వీక్లీ ఆఫ్లతో ఆషామాషీగా ముందుకు సాగలేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియో జకవర్గంలో జోరువర్షంలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడి కి గాయపడి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్క చేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కుసంకల్పంతో నడక ఆపలేదు. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్య లను తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందగా, 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నరమందికి పైగా ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు.
రాయలసీమ ప్రేమ
గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారు. 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కి.మీ. మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ యువనేత పాదయాత్ర సాగిం ది. రాయలసీమలో యువగళానికి లభించిన అపూర్వస్పందన నాటి అధికార పార్టీ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఉక్కుసంకల్పంతో సాగిన యువగళాన్ని అడ్డుకోవడం వారి తరం కాలేదు.
దక్షిణకోస్తా దద్దరిలిల్లింది
ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 31రోజులపాటు 459 కి.మీ యువగళం పాదయాత్ర జనసంద్రంలా సాగింది. ప్రకాశం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 17 రోజుల పాటు 220 కి.మీ, గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో 16 రోజుల పాటు 236 కి.మీ.లు, కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8 రోజులపాటు 113 కి.మీ మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. విజయ వాడ నగరంలో తెల్లవారుజామున 4.30 గంటల వరకు కూడా ప్రజలు యువనేత కోసం రోడ్ల వెంట వేచిచూశారు.
గోదావరి ఉప్పొంగింది
ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజులపాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజక వర్గాలు, 11 రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 (రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, తుని) నియోజకవర్గాలు, 12 రోజులు.. 178.5 కి.మీ కలిపి మొత్తం 404 కి.మీ. మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో 79 రోజుల పాటు విరామానంతరం రాజోలు నియోజకవర్గం పొదలా డ వద్ద నవంబర్ 27న పునఃప్రారంభమైన యువగళం 2.0లో ప్రజలు గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ఉత్తేజం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 7 రోజులు, 113 కి. మీ మాత్రమే యాత్ర కొనసా గినప్పటికీ ప్రజలు ఉత్తేజంతో యువనేత వెంట నడిచారు. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక నియో జకవర్గాల్లో యువగళం పాదయాత్ర సాగింది. లక్షలాది ప్రజలు, అభిమానులు, మహిళలు, టీడీపీ-జనసేన కార్యకర్తలు యువనేత కు నీరాజనాలు పట్టారు. మహిళలు, బీసీలు, రిటైర్డ్ ఉద్యోగులు, మత్స్యకారులు, యాదవులు, అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవా ఉద్యో గులతో లోకేష్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పలు హామీలు ఇచ్చారు.
హామీల అమలు దిశగా ప్రజాప్రభుత్వం
అడుగులు
సుదీర్ఘ యువగళం పాదయాత్రలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చా రు. పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన ఈ హామీ లను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజునే మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రకటించి కేవలం 150 రోజుల వ్యవధి లోనే ప్రక్రియ పూర్తిచేసి 15,941 మందికి టీచర్ ఉద్యోగ నియామకపత్రాలు అందించారు. అధికారంలోకి వచ్చాక యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటివరకు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే 23.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం అవగా హన ఒప్పందాలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎల్బీ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. మిగిలిన హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన యువనేత లోకేష్.. ఇందుకోసం ప్రత్యేక యంత్రాం గాన్ని ఏర్పాటు చేశారు.














