మూడు రోజులు విరామం తర్వాత 50వ రోజు ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒనుకు వారి పల్లి విడిది కేంద్రం నుంచి ఓ డి సి వరకు సాగిన పాదయాత్రలో నారా లోకేష్ సోదరుడు నారా రోహిత్ పాల్గొని సంఘీభావం పలికారు. నారా లోకేష్ వెంట నారా రోహిత్ నడిచి ప్రజలను ఉత్తేజపరిచారు. అడుగడుగునా ప్రజలు లోకేష్ కు స్వాగతం పలికారు. పాదయాత్రలో పాల్గొన్న అందరికీ పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు.
యువగళం పాదయాత్రలో పాల్గొననే ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని ఆలోచనతో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. 50వ రోజు ఒనుకు వారి పల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ఒడిసి వద్ద మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పల్లె రఘునాధ రెడ్డి భోజన ఏర్పాట్లు చేశారు. పాదయాత్రలో పాల్గొన్న వేలాది మంది భోజన వసతిని వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరికి భోజనం, మంచినీళ్లు సదుపాయం కల్పించారు. భోజన వసతి కల్పించిన పల్లె రఘునాథ్ రెడ్డికి ఆ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.











