హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భం గా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసినా.. ఘనత పీవీ నరసింహారావుది అన్నారు. ప్రధానిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినా.. మహానుబాహుడు..మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి దేశసేవను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళి ఆర్పించారు.