అమరావతి (చైతన్య రథం): పోలవరం నుంచి బనకచర్ల అనుసంధానం ప్రభుత్వం యొక్క తొలి ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. పోలవరం నుంచి బనకచర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నాలుగు నెలల్లో ప్రాజెక్టు ప్రారంభించాలని, కేంద్ర ప్రభుత్వం నుండి వెంటనే ఆమోదం తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. హంద్రీనీవ, వెలుగొండతోపాటు అన్ని ప్రాజెక్టు మెయింటెనెన్స్ చెక్ చేసుకోవాలని, వచ్చే ఏడాదికి రిజర్వాయర్లన్నీ నింపాలని.. దానికి ఇప్పటినుంచి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం రిజర్వాయర్లు వందశాతం నీళ్లు నింపాలని సూచించారు.
టూరిజం..
టూరిజంలో తీసుకొచ్చిన కొత్త పాలసీ అమలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏటికొప్పాక బొమ్మల కాన్సెప్ట్‌తో తయారు చేసిన శకటానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయస్థాయిలో మూడవస్థానం వచ్చిందని.. అలాంటి వాటికి మరింత ప్రచారం కల్పించాలన్నారు. పాలసీ ఇచ్చాం. కానీ దానికి అనుగుణంగా పెట్టుబడులు రావాలి. మనం సైట్లు ఇవ్వడానికి అనుకూలం అంత మూమెంట్ లేదు. చాలామంది రూమ్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి చాలా అవకాశాలున్నాయి. క్రియెటివ్, ప్లానింగ్ ప్రకారం అధికారులు వెళ్లాలి. అన్ని గ్రూపులు ఏపీకి రావాలని సిద్ధంగా ఉన్నాయి. రీసోర్సెస్ బిల్డ్ చేసుకోవాలి. పర్యాటకమంటే మనీ కాదు, క్రియోటివిటీ అన్నారు. సెంట్రలైజడ్జ్ ప్రాజెక్టులకు కేంద్రం మందుకు వస్తున్నాయి. హోటళ్లను పీపీపీ పద్ధతిలో నడపించాలి. టూరిజానికి పరిశ్రమల హోదా ఇవ్వడంతో చాలమంది ముందుకొస్తున్నారని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వివరించారు.