- వనరుల వినియోగంతో ఏపీకి మంచిపేరు
- టూరిజం స్పాట్లలో గోవా కన్నా విశాఖే బెటర్
- జర్మనీ మాదిరిగా హట్స్ ఏర్పాటు చేయాలి
- సకాలంలో అనుమతులు జారీ చేయాలి
- స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
- ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ మీట్లో ప్రసంగం
- పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పిలుపు
విశాఖపట్నం(చైతన్యరథం): రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కొన్ని నిబంధనలు సడ లించాల్సిన అవసరముందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖలో సోమవారం జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా అధికారులతో పాటు నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడిరచారు. సదస్సులో అయ్య న్నపాత్రుడు మాట్లాడుతూ వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు. పర్యాటకశాఖలో పెట్టుబడులు పెట్టే వారికి ఆటంకాలు లేకుం డా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్టణం చాలా కీల కమైన ప్రదేశమని చెప్పిన ఆయన ఇక్కడ అనేక టూరిజం స్పాట్లు ఉన్నాయన్నారు. గోవా కన్నా విశాఖనే బెటర్ అని భావిస్తున్నామన్నారు. లంబసింగిలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గెస్ట్‌హౌస్‌ను గత ఐదేళ్లు పూర్తి చేయలేదన్నారు. లమ్మసింగి లాంటి ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పిం చాలని పర్యాటక మంత్రి దుర్గేష్‌ను కోరారు. జర్మనీ మాదిరిగా విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు చిన్న చిన్న హట్స్ వేయాలని కోరారు. 1(17) చట్ట ప్రకారం ట్రైబల్ ఏరియాలో గిరిజనులు పెట్టుబడులు పెట్టాలంటే పెట్టలేరని తెలిపారు. సడలింపులు ఇస్తే పెట్టుబడి దారులు ముందుకు వస్తారన్నారు. చట్టంలో మార్పులు అవసరమను కుంటే దానిపై అధ్యయనం చేయాలన్నారు. యారాడ సమీపంలో అద్భుతమైన బీచ్‌ను అభివృద్ధి చేయా ల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అక్కడ రిసార్ట్స్‌లు కట్టాలని సూచించారు. ఇన్వెస్టర్లకు సకాలంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్లు, ఏపీటీడీసీ అధికారులను ఆదేశించా రు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమం, స్థానికంగా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు.
జీడీపీతో పాటు ఉద్యోగావకాశాలు
పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్‌జైన్
టూరిజం రంగం ద్వారా జీడీపీ అభివృద్ధితో పాటు ఉద్యోగావకాశాలు వస్తాయి. పర్యాటక రంగంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ముఖ్య మంత్రి చంద్రబాబు ధ్యేయం. విజన్ 2047 డాక్యుమెంట్లో సైతం పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ, టాన్స్వర్ డ్యూటీ, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయిస్తూ విడుదల చేసిన నూతన పర్యాటక పాలసీ 2025-29 అద్భుతంగా ఉంది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా దక్కడం శుభపరిణామం. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. ప్రభుత్వం తరపున పెట్టుబడిదారులకు సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. విశాలమైన సముద్ర తీరం ఉన్న ఏపీలో బీచ్ టూరిజంపై దృష్టి సారిస్తున్నాం. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్న బీచ్‌లలో ప్రాథమిక మౌలికవసతులు కల్పించి వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారం భించాల్సి ఉంది. మాల్దీవుల్లో ప్రతి 20 మీటర్లకు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. ఆ తరహా మౌలిక వసతులు ఇక్కడా కల్పించాల్సి ఉంది. రాష్ట్రంలో హోటళ్లు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకురావాలి. ఈనెల 31న అరకు ఉత్సవం ఉందని, స్థానికంగా ఉండే అవకాశాల ను మరింత ప్రమోట్ చేస్తాం. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముంది. విశాఖలో 10 టూరిస్ట్ ప్రాంతాలను కలిపి టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేసి అందులో గైడ్‌ను పెట్టి పర్యాటకులకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని మంత్రి దుర్గేష్ చెప్పారు. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేద్దామని పిలు పునిచ్చారు. పర్యాటక అనుమతులకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారు. భవిష్యత్‌లో విశాఖ అంతర్జాతీయ నగరాల జాబితాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెట్టుబడులకు ముందుకురావాలి
` ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ
గత ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధిలో కుంటుపడిరది. సీఎం చంద్రబాబు నూతన టూరిజం పాలసీ తెచ్చి దేశంలోనే పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తడ వరకు అద్భుతమైన సముద్రతీరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులు చేప డుతున్నాం. ఏపీలో వనరులు పెంచి పర్యాటకాన్ని వృద్ధికి స్పష్టమైన కార్యాచరణ రూపొం దించుకున్నాం. టూరిజం శాఖ లోపాలను ఎత్తి చూపుతూనే ప్రమోట్ చేయాల్సిన అవ కాశం మీడియాపై ఉంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది.
న్యూ టూరిజం డెస్టినేషన్ సిటీగా విశాఖ
` విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్
జీడీపీలో రాష్ట్రంలోనే విశాఖపట్టణం నంబర్ వన్ స్థానంలో ఉంది. విశాఖ సిటీలో 50కి పైగా మెగా, 1200కి పైగా మధ్యతరహా, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ పట్టణంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు ఆకాశమే హద్దుగా వనరులు, విస్తృ తమైన అవకాశాలు ఉన్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేందుకు అవసరమైన కనెక్టివిటీ ఉన్న నగరం. న్యూ టూరిజం డెస్టినేషన్ సిటీగా విశాఖ ఉంది. హెల్త్ టూరిజంకు విశాఖ చిరునామాగా మారింది. పెమా వెల్నెస్ సెంటర్‌కు విశాఖ, వెల్నెస్ టూరిజానికి పాడేరు, అరకు ఉన్నాయి. బుద్దిస్ట్ టూరిజానికి ప్రతీకగా నిలిచే తొట్లకొండ, బొజ్జనకొండ, పావురాలకొండ, బావికొండ తదితర ప్రదేశా లు ఉన్నాయి. బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో ఇప్పటికే సీ ప్లేన్ ట్రయల్‌రన్ విజయవంతం అయింది. అరకులో త్వరలోనే సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తాం. విద్యార్థులకు ఉపయోగపడేలా బయోడైవర్సిటీ, జూపార్క్, కంబాలకొండ నేషనల్ పార్క్, మారిటైం, సబ్ మెరైన్, హెలికాఫ్టర్ మ్యూజియం తదితర ప్రాంతాలను కలిపేలా ఎడ్యుకేషన్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. హిస్టారికల్ టూరిజం, క్యారవాన్ టూరిజం అంశాలను ప్రస్తావించారు.
సదరన్ రీజినల్ కల్చర్ హబ్‌గా అరకు
` అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్
రాష్ట్రంలో అల్లూరి జిల్లా రెండవ అతిపెద్దది. 73 శాతం అటవీ, పచ్చని ప్రకృతిలో అలారారే ఈ జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. అరకు మొదలుకుని లమ్మసింగి, మారేడుమిల్లి వరకు పదుల సంఖ్యలో అద్భుతమైన సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలు ఉన్నాయి. వాటిని సర్క్యూట్‌గా చేస్తే పర్యాటకులను ఆకర్షిం చ వచ్చు. ఇంటర్నేషనల్ టూరిస్ట్‌కు గేట్ వేగా విశాఖ ఉంటుంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల కు నెలవైన అల్లూరి జిల్లాలో రిలీజియస్, వెల్నెస్ టూరిజంను వృద్ధి చేయవచ్చు. థింసా నృత్యం, ఆర్గానిక్ ప్లాంటేషన్లు, అరకు కాఫీ తదితర ప్రత్యేకతలు ఇక్కడి ప్రాంతం సొంతం. మేఘాలయ, మిజోరాంలా అరకును సదరన్ రీజినల్ కల్చర్ హబ్‌గా చేస్తే బాగుంటుంది. అరకు చలి ఉత్సవ్‌లో ఈ ప్రాంతంలోని కల్చర్‌ను, పర్యాట కంగా అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరిస్తాం. ఇన్వెస్టర్లు ముందుకువచ్చి పెట్టుబడు లు పెట్టేందుకు ఇది మంచి సమయం. ట్రైబల్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అథారిటీ కౌన్సిల్ ప్రకారం గిరిజనాభివృద్ధి కోసం కోసం శాశ్వతంగా ఫండ్ క్రియేట్ చేసింది. గిరిజనుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉంది.
బీచ్ ఫ్రంట్ టూరిజంలో పెట్టుబడులు పెట్టండి
` అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్
వైజాగ్, అరకు పర్యాటకుల గమ్యస్థానాలు. అనకాపల్లి ఇండస్ట్రియల్ డిస్ట్రిక్. బీచ్ తో పాటు పలు గిరిజన ప్రాంతాలు ఉన్న అనకాపల్లిలో పర్యటకాన్ని వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి తంతడి, సీతాపాలెంలో బీచ్ ఫ్రంట్ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.. స్థానికంగా 80 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ పర్యాటకులకు అవసరమైన రిసార్ట్స్‌లు, మౌలిక వసతులు లేవు. ఇన్వెస్టర్లు ఈ ప్రాం తంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావాలి.
రాష్ట్రంలో విభిన్న టూరిజం ప్రక్రియలు
` టూరిజం ఎండీ ఆమ్రపాలి
ఇటీవలే తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వ హించామని చెప్పిన ఆమ్రపాలి.. టూరిజం పాలసీ 2025-29పై ఇన్వెస్టర్లకు ప్రజం టేషన్ ఇచ్చారు. టెంపుల్ టూరిజమే కాకుండా విభిన్న టూరిజం ప్రక్రియలను ప్రవే శపెట్టబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న టూరిజం సర్క్యూ ట్లపై వివరించారు.