పసిబిడ్డల సాక్షిగా ఏమిటా బజారు భాష?
పీకడానికి ఏముంది జగన్‌రెడ్డీ నీ దగ్గర?
అమరావతి: సమస్యల చుట్టిముట్టినపుడు చేతగానివాడు ప్రయోగించే ఏకైక విద్య ఎదురుదాడి. పాలన చేతగాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మందబలంతో గత మూడేళ్లుగా అమలుచేస్తున్న చీప్ ట్రిక్ ఇదే. తన తుగ్లక్ నిర్ణయాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చినప్పుడల్లా తన పెంపుడు కుక్కలు విజయసాయిరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వంటివారితో ప్రతిపక్షనేతలు, మీడియాపై విషం చిమ్ముతూ వచ్చారు. గత కొంతకాలంగా సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఏ సమయంలో పెంపుడు కుక్కలు ఎందుకు మొరుగుతున్నాయో జనం అర్థం చేసుకుని ఎక్కడికక్కడ నిలదీయడం మొదలెట్టారు. అన్ని అస్త్రాలు అయిపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ రెడ్డి ఫ్రస్టేషన్ తో నేరుగా రంగంలోకి దిగారు. దాని ఫలితమే శ్రీకాకుళంలో సోమవారం ప్రయోగించిన వెంట్రుక భాష. బుగ్గలు నిమురుతూ ముద్దులు పెడుతూ మాయమాటలు చెప్పడంతో మేకవన్నె పులి, నయవంచకుడు అయిన జగన్ రెడ్డి నిజస్వరూపం తెలియక మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రజానీకం ఆయనకు 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. స్వల్పకాలంలో సుమారు 8కోట్లరూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను బుల్డోజర్లతో కూల్చివేసి విధ్వంసక పాలనకు తెరలేపారు. శాడిస్టు ముఖ్యమంత్రి పాలనలో గత మూడేళ్లుగా జనం నరకం చూశారు. అమ్మఒడి, నాడు-నేడు పేరుతో తాను రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేశానని డప్పాలు కొట్టుకున్న జగన్ రెడ్డి పనితనం ఏమిటో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ మీడియట్ ఫలితాలతో తేలిపోయింది. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన 18మంది విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. రాష్ట్రంలో దాదాపు లక్ష కోట్ల విలువైన ఎయిడెడ్ , మున్సిపల్ పాఠశాలల ఆస్తులపై కన్నేసిన జగన్ రెడ్డి విలీనం పేరుతో దౌర్జన్యంగా వాటిని లాక్కొని లక్షలాది పేద విద్యార్థులను రోడ్డునపడేశారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులను మూడేళ్లుగా భర్తీచేయకుండా సర్కారు విద్యను పాడుబెట్టారు. నాడు-నేడు పేరుతో స్కూళ్లకు రంగులువేసి రూ.3,500 కోట్లరూపాయలను అడ్డంగా మేసేశారు. వీటన్నింటినుంచి అమయాకులైన పేదల దృష్టి మళ్లించేందుకు అమ్మఒడి అనే తాయిలాన్ని జగన్ రెడ్డి జనంపై ప్రయోగించారు. తొలుత కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ అమ్మఒడి ఇస్తామని సెలవిచ్చిన జగన్ రెడ్డి దంపతులు అధికారపగ్గాలు చేపట్టాక తూచ్ ఒక్కరికే ఇస్తామని మెలికపెట్టారు. బాత్రూమ్ ల కోసమని వెయ్యి, మౌలిక సదుపాయాల కోసమని మరో వెయ్యి కోతపెట్టి 15వేలను కాస్త 13వేలకు కుదించారు. కరోనాలో స్కూళ్లు జరగలేదనే వంకతో గత ఏడాది పథకానికి పంగనామం పెట్టి 6,500 కోట్లు మిగుల్చుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు అచ్చివచ్చిన విద్య అడ్డగోలు దోపిడీని యథేచ్చగా సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి దివాలా తీయించారు. అమ్మఒడి పేరుతో పేద విద్యార్థులకు 19వేల 600 కోట్ల ఇచ్చానని చెబుతున్న జగన్ రెడ్డి… రాష్ట్రంలో నిరుపేదలైన మందుబాబుల రక్తమాంసాలను తాకట్టుపెట్టి 33వేల కోట్లు అప్పుతెచ్చారు. కాల్వలో తూటికాడ తీసే 5లక్షల కాంట్రాక్ట్ పనికి పిలచిన టెండరులో డబ్బుల కోసం కోర్టు మెట్లు ఎక్కకూడదని, తాము ఇచ్చినపుడు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించి గొప్ప పరిపాలనాదక్షుడు జగన్ రెడ్డి. మీ నిర్వాకం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంపై అప్పుభారం 8.29లక్షల కోట్లకు చేరింది. నీ ముఖం చూసి ఎవరూ అప్పులిచ్చే అవకాశం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పీకడానికి ఆయన వద్ద ఏమీలేదు. 151మంది మందబలం ఉన్నా ఇక తాను చేయగలిగిందేమీ లేదని గ్రహించిన జగన్ రెడ్డి… అభం శుభం తెలియని వేలాదిమంది పసిహృదయాల సాక్షిగా శ్రీకాకుళంలో పీకుడు భాష ప్రయోగించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రెడ్డి సభ్యత,సంస్కారాలు మరిచి ప్రయోగించిన ఆ భాషతో చిన్నారులు నివ్వెరపోయారు. సాధారణంగా పల్లెటూర్లలో ఇటువంటి భాష ప్రయోగించే వారిని ప చదువుకుంటున్నావా, గొడ్లు కాస్తున్నావా అని పెద్దలు మందలిస్తుంటారు. ఇక్కడ ఆ భాష ప్రయోగించింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన చిన్నప్పుడు చదువుకున్నాడో, పేపర్లు దొంగిలించి పాసయ్యోడో, గేదెలుకాశాడో తెలియదు కానీ సిఎం స్థాయిలో ఉండి బజారు భాష మాట్లాడాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… అయితే అయిదేళ్లకోసారి మాత్రమే తమ నిర్ణయాన్ని వెల్లడిరచే అవకాశం భారత రాజ్యంగం పౌరులకు కల్పించింది. అహంకారం తలకెక్కి, ఉచ్చనీచాలు మరిచి, సిగ్గూలజ్జా వదిలేసి తప్పుడుకూతలు కూస్తున్న జగన్ రెడ్డి, వైసిపి దొంగలను ఎప్పుడు ఎన్నికలను వచ్చినా పీకి పాతరేసేందుకు జనం రెడీగా ఉన్నారు. అధికారమదంతో విర్రవీగిన గొప్పగొప్ప నియంతలే కాలగర్భంలో కలసిపోయారు… వారితో పోలిస్తే నువ్వొక వెంట్రుక మాత్రమే. తస్మాత్ జాగ్తత్త జగన్ రెడ్డీ?
రెడ్డి పనితనం ఏమిటో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ మీడియట్ ఫలితాలతో తేలిపోయింది. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన 18మంది విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. రాష్ట్రంలో దాదాపు లక్ష కోట్ల విలువైన ఎయిడెడ్ , మున్సిపల్ పాఠశాలల ఆస్తులపై కన్నేసిన జగన్ రెడ్డి విలీనం పేరుతో దౌర్జన్యంగా వాటిని లాక్కొని లక్షలాది పేద విద్యార్థులను రోడ్డునపడేశారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులను మూడేళ్లుగా భర్తీచేయకుండా సర్కారు విద్యను పాడుబెట్టారు. నాడు-నేడు పేరుతో స్కూళ్లకు రంగులువేసి రూ.3,500 కోట్లరూపాయలను అడ్డంగా మేసేశారు. వీటన్నింటినుంచి అమయాకులైన పేదల దృష్టి మళ్లించేందుకు అమ్మఒడి అనే తాయిలాన్ని జగన్ రెడ్డి జనంపై ప్రయోగించారు. తొలుత కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ అమ్మఒడి ఇస్తామని సెలవిచ్చిన జగన్ రెడ్డి దంపతులు అధికారపగ్గాలు చేపట్టాక తూచ్ ఒక్కరికే ఇస్తామని మెలికపెట్టారు. బాత్రూమ్ ల కోసమని వెయ్యి, మౌలిక సదుపాయాల కోసమని మరో వెయ్యి కోతపెట్టి 15వేలను కాస్త 13వేలకు కుదించారు. కరోనాలో స్కూళ్లు జరగలేదనే వంకతో గత ఏడాది పథకానికి పంగనామం పెట్టి 6,500 కోట్లు మిగుల్చుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు అచ్చివచ్చిన విద్య అడ్డగోలు దోపిడీని యథేచ్చగా సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి దివాలా తీయించారు. అమ్మఒడి పేరుతో పేద విద్యార్థులకు 19వేల 600 కోట్ల ఇచ్చానని చెబుతున్న జగన్ రెడ్డి… రాష్ట్రంలో నిరుపేదలైన మందుబాబుల రక్తమాంసాలను తాకట్టుపెట్టి 33వేల కోట్లు అప్పుతెచ్చారు. కాల్వలో తూటికాడ తీసే 5లక్షల కాంట్రాక్ట్ పనికి పిలచిన టెండరులో డబ్బుల కోసం కోర్టు మెట్లు ఎక్కకూడదని, తాము ఇచ్చినపుడు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించి గొప్ప పరిపాలనాదక్షుడు జగన్ రెడ్డి. మీ నిర్వాకం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంపై అప్పుభారం 8.29లక్షల కోట్లకు చేరింది. నీ ముఖం చూసి ఎవరూ అప్పులిచ్చే అవకాశం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పీకడానికి ఆయన వద్ద ఏమీలేదు. 151మంది మందబలం ఉన్నా ఇక తాను చేయగలిగిందేమీ లేదని గ్రహించిన జగన్ రెడ్డి… అభం శుభం తెలియని వేలాదిమంది పసిహృదయాల సాక్షిగా శ్రీకాకుళంలో పీకుడు భాష ప్రయోగించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ రెడ్డి సభ్యత,సంస్కారాలు మరిచి ప్రయోగించిన ఆ భాషతో చిన్నారులు నివ్వెరపోయారు. సాధారణంగా పల్లెటూర్లలో ఇటువంటి భాష ప్రయోగించే వారిని ప చదువుకుంటున్నావా, గొడ్లు కాస్తున్నావా అని పెద్దలు మందలిస్తుంటారు. ఇక్కడ ఆ భాష ప్రయోగించింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన చిన్నప్పుడు చదువుకున్నాడో, పేపర్లు దొంగిలించి పాసయ్యోడో, గేదెలుకాశాడో తెలియదు కానీ సిఎం స్థాయిలో ఉండి బజారు భాష మాట్లాడాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… అయితే అయిదేళ్లకోసారి మాత్రమే తమ నిర్ణయాన్ని వెల్లడిరచే అవకాశం భారత రాజ్యంగం పౌరులకు కల్పించింది. అహంకారం తలకెక్కి, ఉచ్చనీచాలు మరిచి, సిగ్గూలజ్జా వదిలేసి తప్పుడుకూతలు కూస్తున్న జగన్ రెడ్డి, వైసిపి దొంగలను ఎప్పుడు ఎన్నికలను వచ్చినా పీకి పాతరేసేందుకు జనం రెడీగా ఉన్నారు. అధికారమదంతో విర్రవీగిన గొప్పగొప్ప నియంతలే కాలగర్భంలో కలసిపోయారు… వారితో పోలిస్తే నువ్వొక వెంట్రుక మాత్రమే. తస్మాత్ జాగ్తత్త జగన్ రెడ్డీ?