కాకినాడ: అమరావతిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బముగా కాకినాడ జిల్లాలో పార్టీ అభివృద్ధిపై లోకేష్‌తో నవీన్ చర్చించారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న జ్యోతుల నవీన్‌ని లోకేష్ అభినందించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లాలో పార్టీ పరిస్థితులపై లోకేష్‌తో నవీన్ చర్చించారు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు జంపన రవి వర్మ, తూము కుమార్ పాల్గొన్నారు.