- మంత్రి నారా లోకేష్ సంతాపం
- కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా
అమరావతి (చైతన్యరథం): తెలుగు యువత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర ఆకస్మిక మృతి తనను తీవ్రంగా కలిచివేసిందిని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సురేంద్ర గుండెపోటుకు గురై మరణించడం పట్ల మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలూరు నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాల్లో సురేంద్ర చురుగ్గా పాల్గొనే వారన్నారు. సురేంద్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.