.దళితుల దమనకాండ సాధించడమే వైసీపీ సిద్ధాంతమా ?
.మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ రూరల్: సీఎం జగన్ రెడ్డి ఒక పెత్తందారులా… నియంతలా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాయు వ్యాఖ్యలు చేశారు. దళితుల దమనకాండ సాధించడమే వైసీపీ సిద్ధాంతమా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని విమర్శించారు. విజయవాడ రూరల్‌లోని గొల్లపూడిలో ఆయన పర్యటించారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు అడ్డగోలుగా పెరిగాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో సహా పలువురు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధర్నా చౌక్ వచ్చే పలు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై దాడులు నిత్వకృత్యమయ్యాయని మండిపడ్డారు. మూడేళ్ళ పాలనలో ఎస్సీలకు జగన్ మొండి చేయి చూపించారన్నారు. దళితుల కోసం కేటాయించిన వేలకోట్ల సబ్‌ప్లాన్ నిధులను వైసీపీ పాలకులు దారిమళ్లించారని ఆరోపించారు. తిరిగి ఆ నిధులన్నింటినీ రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల కోసం గతంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అంబేద్కర్ విద్యా స్కీంలను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసిందన్నారు. దళితులంతా చైతన్యవంతులై జగన్ సర్కార్‌పై సమరశంఖం పూరించాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు.