అమరావతి(చైతన్యరథం): ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంతో పాటు వారిని అన్నివేళలా గౌరవిస్తామని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యా య సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుం టామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యా య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్.గణపతి రావు, ఎస్టీయూ విశాఖ జిల్లా కార్యదర్శి ఇ.పైడిరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.సదాశివరావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర సీపీఎస్ కన్వీనర్ గుజ్జల తిరుపాల్, గుం టూరు జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడు జీవీఎస్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాశీవిశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు.