- ఎయిమ్స్, ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్ మధ్య ఒప్పందం
- 40 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
అమరావతి(చైతన్యరథం): సాంఘిక సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో విద్యార్థు లకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభు త్వం కృషి చేస్తోంది. గురుకుల పాఠశాలల విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేం దుకు మంగళగిరి ఎయిమ్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఈఎస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సోమవారం ఏపీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఈఎస్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్, ఎయిమ్స్ రీసెర్చ్ డీన్ దీప్తి ఎంవోయూపై సంత కాలు చేశారు. బీమ్(బిల్డింగ్ హెల్త్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎంపవరింగ్ అడోల్‌సెంట్) ప్రాజెక్ట్‌లో భాగంగా గురుకులాల్లో పోషకాహార లోపం, రక్తహీనత, దీర్ఘకాలిక వ్యాధులు న్న విద్యార్థులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందిస్తారు. మొదటగా రాష్ట్రవ్యాప్తం గా 40 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నారు.