- కూటమి పాలనలో అంగన్‌వాడీలకు న్యాయం
- ట్రాక్టర్‌లతో తొక్కించి వేధించారు
- యాప్‌ల పేరుతో నాడు పనిభారం మోపారు
- కూటమి ప్రభుత్వంలో వారికి ప్రతి నెలా జీతం
- జీతం రూ.10500లకు పెంచింది చంద్రబాబే
- గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కట్ చేశారు
- అంగన్వాడీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వైసీపీ విషప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు
- టీడీపీ అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార అధ్యక్షురాలు సునీత
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ విషప్రచారంలో పడి అంగన్‌వాడీలు మోసపో వద్దని టీడీపీ అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమా వేశంలో ఆమె మాట్లాడారు. గత ఐదేళ్ల అరాచక పాలనలో అంగన్‌వాడీలు ఏ విధం గా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసునన్నారు. నాడు న్యాయబద్ధమైన కోర్కెలను నెరవేర్చ మంటే వైసీపీ నేతలు పోలీసుల బూటు కాలితో తన్నించిన విషయం ఎవరూ మరువరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలు ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎక్కాల్సి న అవసరం లేదని..వారి సంక్షేమానిక చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. 2014 -2019లో రాష్ట్రం ఎన్నో సమస్యలతో ఉన్నా రూ.4,200 ఉన్న జీతాన్ని రూ. 10,500లకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. అంగన్‌వాడీల సంక్షేమానికి, అభివృ ద్ధికి కృషి చేసింది చంద్రబాబేనన్నారు. ఆయనకు మహిళాభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంగన్‌వాడీల సంక్షేమానికి గ్రాడ్యుటీ అమలు, వయో పరిమితి 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, జీవో నెంబర్ 7 ద్వారా మట్టి ఖర్చులకు రూ.15 వేలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీల న్యాయబద్ధ మైన కోర్కెలు అన్నీ నెరవేరుస్తామని చెప్పారు.
గత ప్రభుత్వంలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వారి సంక్షేమ పథకాలను రద్దు చేసి అన్యాయం చేసిందన్నారు. నాడు నేడు పేరుతో దోచుకున్నారే తప్ప నాడు అంగన్‌వాడీల్లో మౌలిక వసతులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నేడు ప్రతి అంగన్వాడీ సెంటర్‌లో మౌలికవసతులు కల్పించి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు నిధు లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 18 వేల అంగన్‌వాడీ కేంద్రాలను చంద్రబాబు నిర్మించారు. కానీ జగన్‌రెడ్డి నాడు ఎన్నికల హామీల్లో 17 వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క దానిని కూడా నిర్మించలేదన్నారు. చంద్రబాబు పాలనలో 50 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే దాదాపు 40 లక్షల మంది లబ్ధిపొందినట్లు చెప్పారు.
జగన్ పాలనలో పనిభారం
జగన్ పాలనలో బకాయిలు ఇవ్వలేదు, గ్యాస్ బిల్లులు ఇవ్వలేదు, టీఏ, డీఏలు ఇవ్వలేదు. అంతే కాకుండా రక రకాల యాప్‌లు తీసుకువచ్చి అంగన్‌వాడీలపై పని భారం మోపారు. నేడు ఆ పరిస్థితి లేదు.. ప్రతి నెలా జీతాలు పడుతున్నాయి. పని భారం తగ్గింది. కూటమి పాలనలో రోడ్ల మీదకు వచ్చే అవసరం లేదు. తప్పకుండా ఏదైతే చెప్పారో అది ఒక్కొక్కటి అమలు చేస్తారు. సాక్షిలో అంగన్‌వాడీలు పోరుబాట పట్టారని పిచ్చి రాతలు రాస్తున్నారు. గత ప్రభుత్వంలోనే అంగన్‌వాడీలు పోరుబాట పట్టారు. నాటి మంత్రికి అంగన్‌వాడీలు ఏ శాఖలో ఉంటారో కూడా తెలియని దుస్థి తి. నేడు అంగన్‌వాడీ అక్క చెల్లెమ్మలపై వైసీపీ నేతలు ప్రేమను ఒలకబోయడం దురదృష్టకరం. వైసీపీ పాలనలో అంగన్‌వాడీ మహిళలకు రక్షణే లేదు. ఒంగోలులో ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. పామర్రులో వైసీపీ నేతలు అంగన్‌వాడీని వేధిస్తే.. ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కూటమి పాలనలో అంగన్‌వాడీల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. త్వర లోనే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.