- ఇలాంటి సంఘటనల నివారణకు ప్రభుత్వం చర్యలు
- ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని వెల్లడి
- వినియోగించుకోవాలని యువతకు సూచన
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరిట మోసపూరిత ఏజెంట్ల వలలో చిక్కుకుని థాయిలాండ్ వెళ్లి దోపిడీకి గురవుతూ ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వారితో మాట్లాడామని, వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోసపూరిత ఏజెంట్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి సంఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యోగావకాశాలను ధృవీకరించుకునేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించేందుకు 91-863-2340678 నంబర్, వాట్సాప్ నంబర్ 8500027678ను వినియోగించుకోవాలని సూచించారు. విదేశాల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఏ మాత్రం సంకోచించకుండా ూవీజAూ/చీRు ని సంప్రదించాలని మంత్రి లోకేష్ తెలిపారు. యువత భద్రతే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.